జగన్ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండానే హైదరాబాద్‌ లోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలదీక్ష చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్, అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు అవ్వడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముందుగా చెప్పుకోవాలిసినది సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపే, ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేశారు. అక్రమ కట్టడమనే కారణంతో ప్రజావేదికను కూల్చడం వివాదాలకు దారి తీసింది. రాజధాని అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందనేది జగన్ సర్కారు భావనగా క్లియర్ గా కనిపిస్తోంది. దీనితో రాజధాని నిర్మాణ పనులను నిలిపేశారు. సింగపూర్‌ తో చేసుకున్న ఒప్పందం కూడా పూర్తిగా రద్దయ్యింది. మంత్రి బొత్స వ్యాఖ్యలతో రాజధాని రైతులను  అయోమయానికి గురిచేసారు. అయితే ఇటీవలే అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.

 

 

సోలార్, విండ్ పవర్ కోసం గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కేంద్రం వారించినా ఆయన వెనక్కి అసలు తగ్గలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు సహా ఇతర కీలక పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చేపట్టారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగిందని కాస్త భావించొచ్చు. స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటుకు విఘాతం కలుగుతుందనే భావన ఉంది. ప్రత్యేక హోదా కూడా లేకపోవడంతో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఉండదనే వాదన ఒకటి ఉంది. పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే తరహా చట్టం తెస్తే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న మన వాళ్ల మాటేంటనే ప్రశ్నను కూడా ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు.

 

 

ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలిసిన విషయాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడతామని ప్రకటించారు. దీని వల్ల తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. తెలుగు మీడియాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు వారు. అలాగే తెలంగాణతో కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి ప్రయత్నించారు. కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు జగన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ విపక్షాల ఆరోపణలు, నీటి పారుదల రంగ నిపుణుల సూచనలతో జగన్ కాస్త వెనక్కి తగ్గారు. తెలంగాణ భూభాగంతో సంబంధం లేకుండా నదుల అనుసంధానం చేపట్టాలని ఆయన నిర్ణయించారు.

 

 

ఇసుక కొరత కారణంగా జగన్ సర్కారు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను బాగా ఎదుర్కొంది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు జగన్ సర్కారును ఒత్తిడిలోకి నెట్టాయని చెప్పవచ్చు. నూతన ఇసుక విధానం తీసుకొచ్చినా, ఇప్పటి వరకూ ఇసుక లభ్యత ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. పంచాయతీ ఆఫీసులు మొదలు శ్మశానం, సమాధులకే కాదు ఏకంగా గేదెల కొమ్ములకు కూడా వైసీపీ రంగులేయడం వివాదాస్పదమైంది. చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తొలగించడం, అన్నా క్యాంటీన్లను మూసివేయడంలో కూడా చాలా వ్యతిరేకత ఎదురుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: