భారత దేశంలో బంగారం ఇష్టపడని ఆడవాళ్లు అంటూ ఉండరు . ఇప్పుడు భారత్ వ్యాప్తంగా బంగారు నగలకు 'హాల్‌మార్క్' గుర్తును తప్పనిసరి చేస్తున్నామని, ఈ విషయమై నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఏదైనా విలువైన లోహంతో తయారు చేసే వస్తువులో ఆ లోహం ఎంత నిష్పత్తిలో ఉందో కచ్చితంగా నిర్ధరించి, అధికారికంగా ముద్ర వేయడమే హాల్‌ మార్కింగ్. ఇది చాలా దేశాల్లో విలువైన వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది.

 

బంగారు నగల హాల్‌మార్కింగ్ నిర్ణయం అమలుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని మంత్రి పాశ్వాన్ శుక్రవారం చెప్పారు. హాల్‌మార్కింగ్ లేని సరకు నిల్వలను విక్రయించుకోవడానికి వ్యాపారస్తులకు ఏడాది వ్యవధి ఇస్తామని తెలిపారు.

 

హాల్‌మార్కింగ్ నిర్ణయం అమలుకు వీలుగా పసిడి ఆభరణాలు, కళాఖండాలకు గిరాకీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు ఎంట్రిప్రెన్యూయర్ల ఆధ్వర్యంలో కొత్తగా 'లోహ స్వచ్ఛత నిర్ధరణ, హాల్‌మార్కింగ్ కేంద్రాల ' ఏర్పాటుకు, ఆభరణ విక్రేతల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయడానికి ఏడాది వ్యవధి ఇస్తామని పాశ్వాన్ వివరించారు.భారత్‌లో ప్రస్తుతం రెండు విలువైన లోహాలు బంగారం, వెండి హాల్‌మార్కింగ్‌లో పరిధిలో ఉన్నట్లు బీఐఎస్ వెబ్‌సైట్ చెబుతోంది. హాల్‌మార్కింగ్‌పై అంతర్జాతీయ విధివిధానాలకు అనుగుణంగా బీఐఎస్ హాల్‌ మార్కింగ్ కార్యక్రమం ఉందని పేర్కొంటోంది.

 

తప్పనిసరి హాల్‌ మార్కింగ్ ప్రకటనపై 'ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్' ఏపీ శాఖ అధ్యక్షుడు విజయ్ కుమార్ స్పందిస్తూ- దీనివల్ల బంగారు వ్యాపారులందరూ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్లుగా నగల ను విక్రయించాల్సి ఉంటుందన్నారు. ఈ నిర్ణయాన్ని సత్వరం అమలు చేయాలని కోరారు.గ్రామాల్లో చాలా మంది చిన్న వ్యాపారస్తులు ఇది  91.6 (22 క్యారెట్స్) శాతం బంగారమని అమ్ముతున్నారని, దీనివల్ల కొనుగోలుదారులు మోసపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం హాల్‌మార్కింగ్ తప్పనిసరిచేయడం, అమలుచేయడం ప్రజలకు మేలు చేస్తుందని ఆయన  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: