ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం పలు ఆదేశాలు కూడా జారి చేసింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలు అధికార విపక్షాలకు ఇప్పుడు కత్తి మీద సాములా మారాయి. ప్రమాణ స్వీకారం రోజు జగన్ అన్న మాట... ఆరు నెలల్లో మంచి సిఎం అనిపించుకుంటా అని... ఈ ఆరు నెలల్లో జగన్ ఏం చేసారు...? ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరాయి... రాజకీయంగా ఈ కాలంలో ఆయన ఎంత వరకు బలపడ్డారు ? అనేది ఈ ఎన్నికల ఫ‌లితాలే చెప్ప‌నున్నాయి.

 

జగన్ కి ఈ ఎన్నికల్లో ప్రధానంగా కలిసి వచ్చే అంశం... సంక్షేమ పథకాలు. ఆర్దిక లోటు ఉన్నా సరే జగన్ అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా అనుభవం లేకపోయినా ప్రజలకు గెలిపించిన ఋణం జగన్ తీర్చుకుంటున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆరు నెలల్లోనే చెప్పిన దానితో పోలిస్తే జ‌గ‌న్ ఎక్కువే చేశాడంటున్నారు.

 

చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల అమలుకి నాలుగు ఏళ్ళు తీసుకుంటే జగన్ గెలిచిన నెలల వ్యవధిలోనే అమలు చేయడం అనేది నిజంగా సాహసం అనే చెప్పుకోవచ్చు. ఇక వ‌లంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం, ల‌క్ష‌లాది గ్రామ స‌చివాల‌య ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డం లాంటి కీలకమైన నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా తీసుకోవడం వంటివి జగన్ కి కలిసి వస్తున్నాయి. ఆదాయ౦ విషయంలో ఇప్పుడు రాష్ట్రం గాడిలో పడుతుంది.

 

ఒక్కో సంక్షేమ పథకానికి ఇబ్బందులు లేకుండా నిధుల సమీకరణ అనేది మొదలయింది. ఇవన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కి కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రం సహకారం లేకపోయినా జగన్ అమలు చేస్తున్న సంక్షేమమే ఆయన్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: