ప్రియాంక రెడ్డి ఘటన దేశంలో పెను సంచలనాన్ని సృష్టించింది. నలుగురు లారీ డ్రైవర్లు, క్లినర్లు ప్రియాంక రెడ్డిపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు.  9:30 నుంచి 10:08 గంటల వరకు ఆమెపై అత్యాచారం జరిపారు.  అరుస్తున్నది చెప్పి ఆమెను బలవంతంగా మద్యం తాగించారు.  ఆ తరువాత ఆమె ముక్కు, నోటికి చేతులు అడ్డుపెట్టడంతో.. ప్రియాంక రెడ్డి మరణించింది.  
ఆ తరువాత ఆమెను ప్యాంట్ లేకుండానే క్యాబిన్ లో ఎక్కించారు.  అక్కడే  మృతదేహంపై పాశవికంగా అత్యాచారం చేశారు. తరువాత కిందకు దిగి ప్యాంట్ తెచ్చి ఆమెకు తొడిగి చటాన్ పల్లి ఫ్లై ఓవర్ దగ్గరకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.  దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే హైదరాబాద్ నగరంలో నిజాంపేటలో మరో దారుణం వెలుగు చూసింది.  
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగిని తన సోదరితో కలిసి నిజాంపేట ఈశ్వరి విలాస్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నారు.  సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే ఉద్యోగినికి 27 ఏళ్ల జాయ్ చంద్ అనే స్నేహితుడు ఉన్నాడు.  సోదరి బయటకు వెళ్లడంతో అపార్ట్మెంట్ లో ఆమె ఒక్కతే ఉన్నది.  శనివారం మధ్యాహ్నం సమయంలో జాయ్ చంద్ అపార్ట్మెంట్ కు వచ్చాడు.  అలా వచ్చిన వ్యక్తి... ఇంట్లో ఒక్కతే ఉందన్న సంగతి తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే ఆమెపై అత్యచారం చేశాడు.  
దీంతో ఆమె షాక్ అయ్యింది.  అపస్మారక స్థితికి చేరుకుంది.  భయపడిన ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  సాయంత్రానికి బాధిత యువతి సోదరి ఇంటికి వచ్చిన తరువాత జరిగిన సంఘటన చూసి షాక్ అయ్యింది.  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రేప్ కు గురైన యువతిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.  అక్కడే ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు.  అత్యాచారం చేసిన జాయ్ చంద్ పరారీలో ఉన్నాడు.  అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: