ఆమె ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తుంది. రోజూ పాఠశాలకు వచ్చి పిల్లలకు ఇంగ్లీష్ బోధిస్తుంది. కానీ ప్రతిరోజు ఇంగ్లీష్ బోధించే ఆ టీచర్ కు కనీసం ఇంగ్లీష్ చడవడం కూడా రాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన దేశ ప్రజలందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై ఉండే కొద్దిపాటి నమ్మకాన్ని కూడా ఇలాంటి ఘటనలు పోగొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పే టీచర్ కు ఇంగ్లీష్ రాదని తెలిసి దేశ ప్రజలందరూ షాక్ అయ్యారు. 
 
రాజ కుమారి అనే మహిళా ఇంగ్లీష్ టీచర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాలోని సికిందర్ పుర్ సరౌసీలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తోంది. ఉన్నావో జిల్లా మెజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ జిల్లాలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవటానికి కొంతమంది అధికారులతో కలిసి సరౌసీలోని ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ తనిఖీల్లో భాగంగా ఇంగ్లీష్ టీచర్ రాజకుమారిని 8వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాన్ని చదవమని కోరారు. 
 
మహిళ చదవటానికి పడిన కష్టాన్ని చూసి షాక్ అవ్వడం మెజిస్ట్రేట్, ఇతర అధికారుల వంతయింది. ఇంగ్లీష్ భాషను బోధించే టీచర్ ఇంగ్లీష్ చదవలేకపోవడంతో ఆ టీచర్ ను ఏమనాలో కూడా మెజిస్ట్రేట్ కు అర్థం కాలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్ట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టీచర్ కే చదవడం రాకపోతే పిల్లలకు టీచర్ ఏం బోధిస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
 
ఇండియాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానం ఇలాగే ఉంటుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మన విద్యా విధానం అద్భుతం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదవడం రాని టీచర్ కు ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగం ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: