సుప్రీం కోర్టులో చుక్కెదురు అయిన టెలికం కంపెనీలు తాజాగా రేట్లను భారీగా పెంచేసాయి. మొదటగా జియో ప్రస్తుత ప్లాన్లను దాదాపు 20 శాతం వరకు పెంచేసింది. ఆ, తర్వాత ఎయిర్టెల్ కూడా దాదాపు ఇదే పద్ధతిని పాటించింది. తాజాగా వోడాఫోన్ ఐడియా కూడా డిసెంబర్ 3వ తేదీ నుంచి తమ ఛార్జీలను పెంచుతున్నట్లు ఈ రోజు ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ చార్జీల పెంపు దాదాపు 42 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

 అలాగే వోడాఫోన్ నుంచి ఇతర కంపెనీలకు చేసే కాల్స్ పైన నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత తొలి సారిగా ఈ కంపెనీ తన ధరలను పెంచడం గమనార్హం.

 

సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు వ్యతిరేకంగా టెలికాం తీర్పు వచ్చిన తర్వాత, ఏకంగా వోడాఫోన్ సీఈవో  మన దేశ ప్రధాని తో  ఇలా అయితే మేము భారత దేశంలో వ్యాపారం చేయలేము అన్నారు. ఈ తీర్పులో వోడాఫోన్ దాదాపు ప్రభుత్వానికి 39 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. అలాగే ఎయిర్టెల్ కూడా 42 వేల కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉంది.

 

వొడాఫోన్‌ ఐడియా సవరించిన ధరల అన్‌లిమిటెడ్‌ కేటగిరీ కింద 2, 28, 84, 365 రోజులు కింద సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న ప్లాన్లను పోల్చిచూసినప్పుడు కొత్త ప్లాన్ల ధరల్లో 41.2 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్‌లిమిటెడ్‌ ప్లాన్ల స్థానంలో డిసెంబర్‌ 3 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 84 రోజుల కాలపరిమితితో అందించే రూ.458 ప్లాన్‌ ధరను తాజాగా రూ.599కి పెంచారు. ఈ ప్లాన్‌ ధరను 31 శాతం పెంచారు. రూ.199 ప్లాన్‌ ధరను రూ.249కి, ఏడాది పాటు అందించే అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ ధర రూ.1699 నుంచి 2,399కి పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: