గోవా గవర్నర్ సత్య పాల్ మాలిక్ దేశ ధనవంతులు అయిన ముఖేష్, నీతా అంబానీలపై తీవ్ర  విమర్శలు చేశారు. కుళ్ళిన బంగాళాదుంపల సంచితో వారిని పోలిచ్చారు మాలిక్, భారతదేశం యొక్క గొప్ప ధనవంతులు ధర్మం లేదా యువత, పోలీసు సిబ్బంది , సైనికుల సంక్షేమం కోసం డబ్బు ఖర్చు చేయలేదని ఆరోపించారు. మాలిక్ చేసిన ప్రసంగం యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఈ సంవత్సరం 50 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మాట్లాడుతూ “భారతదేశంలో, చూపించబడుతున్నది వాస్తవంగా జరుగుతున్నది మాత్రమే కాదు. చాలా విషయాలు మీడియాకి కనిపించవు. భారత దేశానికి ఇంకా పేదరికం, నిరుద్యోగం ఉంది.

 

 రైతులకు ఇదే పరిస్థితి. సైనికుల దుస్థితిని నేను వ్యక్తిగతంగా చూశాను. మీరు ఇక్కడ కూర్చొని ప్రసంగాలు చేస్తూ వారికి మద్దతునిస్తూ ఉంటారు. మీ దేశంలో, 14 అంతస్తుల ఇంటిని కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఒక అంతస్తు కుక్కల కోసం అంకితం చేసారు, మరొకటి డ్రైవర్ల కోసం కేటాయించారు, కాని వారు మన సైనికులకు దాతృత్వం కోసం ఒక్క పైసా కూడా చెల్లించరు. 


 
ముఖేష్ , నీతా అంబానీలు దక్షిణ ముంబైలో యాంటిలియా అనే బహుళ అంతస్తుల నివాసం కలిగి ఉన్నారు, ఇందులో కార్ పార్క్, సినిమా, హెలిప్యాడ్లు, అతిథుల కోసం ప్రత్యేక అంతస్తులను కలిగి ఉన్నట్లు మన అందరికి తెలిసిందే. ముఖేష్ , నీతా అంబానీలను ‘ కుళ్ళిన బంగాళాదుంపలు ’అని పిలిచిన మాలిక్, వీళ్ళు  విద్య, సైనికులు, పోలీసు సిబ్బంది లేదా యువత కోసం డబ్బు ఖర్చు చేయరు. లార్డ్  గెల్డాఫ్,  మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వంటి ప్రపంచంలోని గొప్ప ధనవంతులు, వారందరూ తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థ కోసం అంకితం చేస్తారు. కానీ మన దేశంలోని ధనికులు అటువంటివి చేయరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: