ప్రతి మనిషికి ఉద్యమ లేచిన తరువాత, నిద్రపోయే సమయంలో కొన్ని దినచర్యలు ఉంటాయి. ఉద్యమ లేచిన వెంటనే కొంతమంది కొన్ని రకాలా హ్యాబిట్స్ ఉంటాయి. అందులో భాగంగానే లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. టీ లేదా కాఫీ తాగందే వాళ్ళు నిద్రపోరు. వాళ్లకు టీ కాఫీ తప్పనిసరి. అయితే, ఈ టీ అలవాటు కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. మనుషులతో పాటుగా కొన్ని జంతువులకు కూడా ఉంటుంది.
అందులో ఇదొకటి కూడా. మాములుగా గుర్రానికి ఉలవలు, పచ్చగడ్డి వేస్తె చాలు హ్యాపీగా తిని పరుగులు తీస్తుంది. ఉదయాన్నే కాస్త పచ్చగడ్డి, నీళ్లు పెడితే అన్ని గుర్రాలు తింటాయి. అయితే, కొన్ని గుర్రాలకు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. అలవాట్లు ఉండటం కాదు.. అలా అలవాట్లను చేస్తున్నారు. ఈ గుర్రానికి కూడా ఓ వ్యక్తి అదే విధమైన అలవాటును చేశాడు.
ఆ అలవాటు ఏంటో తెలుసా.. అక్కడికే వస్తున్నా... గుర్రం ఉదయాన్నే లేవడానికి దానైకి ఓ కప్పు టీ అందించడం మొదలుపెట్టాడు. గుర్రం ముందు టీ కప్పు పెట్టగానే లేస్తుంది. ఎంచక్కా రెండు కప్పుల టీ లాగించేస్తుంది. అంతే వెంటనే యాక్టివ్ అవుతుంది. ఆ గుర్రం పేరు జాక్. లండన్ మెర్సిసైడ్ పోలీసుల దగ్గర పనిచేస్తున్నది. గత 15 ఏళ్లుగా అది అక్కడే పనిచేస్తుంది.
చాల చురుకైన గుర్రం. అయితే, ఉదయాన్నే దానికి టీ ఇవ్వాల్సిందే. ఈ జాన్ గుర్రం ట్రైనర్ ఉదయం లేచేందుకు దానికి టీ ఇచ్చేవాడు. అదే అలవాటుగా మారిపోయింది. గుర్రానికి టీ ఇవ్వందే లేవదు. టీ తగిన తరువాత అది చేసే పని అంతాఇంతా కాదు. చాలా యాక్టివ్ గా సాయంత్రం వరకు పరుగులు తీస్తుంది. సాయంత్రం వరకు పరుగులు తీసిన ఈ గుర్రం సాయంత్రం కాగానే నిద్రపోయే ముందు కూడా ఓ కప్పు టీ అందించాలి. అదితాగి హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.