దిశ పై అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి ఇప్పటికే విలువైన సమాచారం రాబట్టారు.  అయితే, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారం రాబట్టాల్సి ఉన్నది.  కేసును సాంకేతికంగా కూడా కోర్టులో నిరూపించాలి అంటే ఇప్పుడున్న సమాచారం కంటే కూడా ఇంకా విలువైన సమాచారం అవసరం.  

 


అందుకే కస్టడీకి ఆ నలుగురు నిందితులను తీసుకోవాలని చూస్తున్నారు.  కాగా, ఈరోజు మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు.  పిటిషన్ విచారించాక జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.  ఒకవేళ వారి వద్దనుంచి విలువైన సమాచారం తీసుకోవడానికి కోర్టు అంగీకరిస్తే.. వారిని వారం రోజులపాటు కస్టడీకి తీసుకుంటారు.  

 


ఈ కష్టడీలోకి తీసుకున్నాక ఎలా వారిని ఇంటరాగేట్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉన్నది.  నేరచరిత్ర ఆధారంగా వారిని ఇంటరాగేషన్ చేసే అవకాశం ఉంటుంది.  పోలీసులు ఇప్పటికే చాలా వరకు సమాచారం సేకరించారు.  అయితే, సాంకేతికంగా కేసు ప్రూవ్ కావలి అంటే, ఖచ్చితంగా ఇంకా విలువైన సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  ఈ సమాచారం మేరకు అన్ని పనులు జరగాల్సి ఉన్నది.  

 


ఎలాగైనా ఈ కేసును ప్రూవ్ చేసి నిందితులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చూడాలని పోలీసులు భావిస్తున్నారు.  నిందితులకు శిక్ష విధించిన తరువాత ఆ శిక్ష ఎలా ఉంటుంది.. మరణ శిక్షవిధిస్తే ఎప్పుడు అమలు చేస్తారు అన్నది చూడాలి.  60 రోజుల్లోపే కేసును పూర్తి చేయాలి అన్నది పోలీసుల సంకల్పం.  ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.  నిత్యం కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.  దానికి తగ్గట్టుగా జడ్జీలు, సాంకేతిక పరిజ్ఞానం పెరగాల్సి ఉన్నది.  మరి చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: