ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి పరిపాలనలో ముందుకు దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో అవినీతిని అంతం చేసేందుకు తన దైన్య వ్యూహాలతో ముందుకు పోతున్న సీఎం.. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను సైతం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవ్వరు అవినీతికి పాల్పడినా.. లంచం డిమాండ్ చేసినా వెంటనే 14400 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని ప్రజలకు సూచించడం జరిగింది. ఫిర్యాదు చేసిన 15రోజుల్లో సమస్యను మొత్తం పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం మొత్తం చర్యటు తీసుకుంటుందని స్పష్టంగా తెలియచేయడం జరిగింది.

 

 

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అవినీతి అధికారులపై ఫిర్యాదు వస్తున్నాయి. ఎక్కువగా గుంటూరు జిల్లా నుంచి ప్రజలు ఫోన్ చేసి అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగింది. రెవెన్యూ, విద్యుత్ అధికారులు తీవ్రంగా లంచం డిమాండ్ చేస్తున్నారని ప్రజలు కాల్ సెంటర్ కు ఫోన్ చేసి మరి తెలియచేస్తున్నారు అట.

 

బర్త్, క్యాస్ట్ సర్టిపికెట్, భూ రిజిస్ట్రేషన్,, ఇంటి పన్నుల విషయంలో… చేయి తడపనిదే అధికారులు పనులు చేయట్లేదని వివరిస్తున్నట్లు బాగా అర్థం అవుతుంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఇప్పటివరకు 250కి ఫైగా ఫోన్లు వచ్చాయని తెలుస్తోంది. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం  అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని విషయాలపై ప్రభుత్వ పెద్దలు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రజలు ఏ పని మీద ఏ కార్యాలయానికి వెళ్లారు.

 

ఎవరు లంచం డిమాండ్ చేశారన్న దానిపై .. అధికారులు రహాస్యంగా ప్రజల నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. ఒక వేళ లంచం డిమాండ్ చేసిన అధికారులపై.. ఆరోపణలు రుజువైతే వెంటనే చర్యలు ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధం అయ్యింది. ఇక పురపాలకశాఖలో సేవలకు జిల్లాలోని 13 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు అందటం చాల గమనించవలసిన విషయం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: