ప్రపంచంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండే దేశాల్లో భారత దేశం కచ్చితంగా ఉంటుంది. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన అవసరాలకు సరిపడా నిల్వలు మన భారత దేశంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మన దేశంలో దాదాపు 80 శాతం అవసరాలకు మనము చమురును దిగుమతి చేసుకుంటున్నాము. 2010లో అత్యధికంగా ధరకి క్రూడాయిల్ చేరింది. కానీ అప్పటి నుంచి తగ్గుతూ వస్తుంది. కానీ భారత దేశంలో మాత్రం ఈ రేటు తగ్గడం లేదు.

 

దీనికి ప్రధాన కారణం భారత దేశంలో విధించే టాక్సలు . భారత దేశంలో చమురు శుద్ధి అయిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ,రాష్ట్ర వ్యాట్ కలుపుకొని పెట్రోల్, డీజిల్ రేట్లు దాని అసలు విలువ కంటే రెండింతలవుతుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం లోక్‌సభలో అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని పన్నులు తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా అనే ప్రశ్నకు సీతారామన్ సమాధానం ఇచ్చారు .

 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక నిర్దిష్ట కాలానికి స్థిరంగా ఉంటాయని సీతారామన్ అన్నారు. వస్తు, సేవల పన్ను కింద పెట్రోల్, డీజిల్ తీసుకురావడం గురించి సభలో మరో ప్రశ్న వచ్చింది, ఒక రకంగా చెప్పాలంటే అవి ఇప్పటికే జీఎస్టీ జీరో కేటగిరీ పరిధిలో ఉన్నాయని మంత్రి చెప్పారు. రేట్లను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించాల్సి ఉందని ఆమె తెలిపారు.

 


ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి పన్నును పరిగణనలోకి తీసుకోలేదని సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. చిన్న రైతులకు డీజిల్‌పై సబ్సిడీ ఇస్తామనే ప్రశ్నపై సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను వివిధ స్థాయిల్లో ఉందని అన్నారు.పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు విధిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: