కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక అమలు చేస్తామని చేసిన ప్రకటనకు డెడ్ లైన్ విధించారు. జాతీయ పౌర పట్టికను 2024 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా అమలుచేస్తానని దేశం నుండి చొరబాటుదారులను పంపించివేస్తానని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయ పౌర పట్టిక వలనే ఓటమి చవిచూశామని ఆ పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
అమిత్ షా జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బహారగోరా, చక్రధర్ పూర్ లో ఈరోజు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. 2024 సంవత్సరంలోపు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక అమలుచేసి చొరబాటుదారులను పంపించివేస్తామని రాహుల్ గాంధీ చొరబాటుదారులను పంపించవద్దని చెబుతున్నారని అమిత్ షా అన్నారు. చొరబాటుదారులను పంపిస్తే ఎక్కడకు వెళతారు..? ఎలా బతుకుతారు...? అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని అమిత్ షా అన్నారు. 
 
దేశం నుండి 2024 సంవత్సరం నాటిని అక్రమ చొరబాటుదారులను పంపించి తీరుతామని అమిత్ షా అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర భవిష్యత్తును ఆ రాష్ట్ర ప్రజల ఓట్లే నిర్ణయిస్తాయని అమిత్ షా అన్నారు. ప్రజల చేతుల్లో జార్ఖండ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలో మావోయిజం వైపుకు ముందుకెళ్లాలో ఉందని అమిత్ షా అన్నారు. జార్ఖండ్ లో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు గత 55 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో చెప్పాలని అమిత్ షా సవాల్ విసిరారు. 
 
అమిత్ షా ప్రతిపక్ష శిబిరంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనులను నాశనం చేస్తున్నారని అమిత్ షా అన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, కోట్ల రూపాయల కుంభకోణాల్లో మునిగిపోవడం తప్ప జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడం లేదని ఆరోపణలు చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి ఐదు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే తొలి విడత పూర్తి కాగా రెండో విడత ఈ నెల 7వ తేదీన జరగనుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: