హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహానికి విజయవాడలో జరిగిన ఘటన కారణమైంది. విజయవాడలోని పున్నమిఘాట్ లో మత మార్పిళ్లు జరిగాయి. లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ మత మార్పిళ్లు చేయడం గమనార్హం. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి కొంత దూరంలోనే ఈ ఘటన జరగటం గమనార్హం. దాదాపు 47 మందికి మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంటికి కూత వేటు దూరంలోనే మత మార్పిళ్లు జరగటం కలకలం సృష్టిస్తోంది. 
 
విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరంలో దుర్గమ్మ పాదాల చెంత ఉన్న పున్నమి ఘాట్ దగ్గర కొంతమంది క్రైస్తవ మత పెద్దలు వచ్చి బాప్తిజం స్వీకరించే వారి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది ధార్మిక సంఘాలకు చెందిన వారు అక్కడకు వెళ్లి వీడియోలను చిత్రీకరించి మీడియాకు చేరవేశారు. పవిత్రంగా భావించే కృష్ణా నదీ తీరంలో మత మార్పిళ్లు జరగటం పట్ల ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
పున్నమి రిసార్ట్ గేట్ కు కూడా మేరీ మాత బొమ్మను పెట్టారని హిందూ ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ధార్మిక సంఘాలు ఈ తతంగం గురించి ప్రభుత్వంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు సాధారణంగా పున్నమి ఘాట్ దగ్గర, దుర్గా ఘాట్ దగ్గర జరుగుతాయి. ఘాట్ ప్రత్యేకంగా ఏ మతానికి చెందినది కానప్పటికీ బహిరంగంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
భారతదేశంలో మతం మారే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంలో బహిరంగంగా లౌడ్ స్పీకర్లు పెట్టటం ప్రచారంలా ఉందని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. సాధారణంగా మత మార్పిళ్లు ప్రార్థనా సంఘాలలో, చర్చీలలో జరుగుతాయి. బహిరంగ ప్రదేశాల్లో గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. ఒక హిందూ అధ్యాత్మిక ప్రాంతంలో బహిరంగంగా మత మార్పిళ్లు చేయటం వలన మనోభావాలు దెబ్బ తింటాయని హిందూ ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: