ఇక నుంచి  తెలంగాణాలో చాలా తక్కువ మంది పిల్లలున్న అంగన్‌వాడీ కేంద్రాలకు మూసి వేయాలని తెలంగాణ ప్రభుత్వము భావనలో ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల నమోదులో చాలా తక్కువగా ఉండడం, మూడు నుంచి ఐదు  సంవత్సరముల పిల్లల  సంఖ్య రోజు రోజుకి బాగా తగ్గిపోతుంది. తక్కువగా ఉండటం లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం చిన్నపిల్లల.. సేవలను అభివృద్ధి చేసే క్రమంలో ఒకేచోట రెండు, మూడు అంగన్‌వాడీ కేంద్రాలుంటే వాటి సంఖ్యను వీలయినంత వరకు కుదించాలని  ప్రభుత్వము యోచిస్తున్నది. వాళ్ళు ఈ మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక మొదలు పెట్టబోతున్నారు. హేతుబద్ధీకరణకు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేయడం మొదలు పెట్టారు.

 

ప్రస్తుతము రాష్ట్రములో అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్కువ మంది లబ్ధిదారులు ఉంటున్నారు. ఇంకా మరి కొన్ని కేంద్రాలలో అయితే ఇద్దరు ముగ్గురు కూడా ఉంటున్నారు. అధికారులు ఎప్పుడైనా అధికారులు విజిట్ చేస్తే ఇంత తక్కువ మంది, ఉన్నారు అని అడుగుతే ఊరికే ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని ఏదో ఒక సాకు చెబుతారు. స్వల్ప నమోదు ఉన్న కేంద్రాల యొక్క జాబితాను ప్రభుత్వము రూపొందిస్తోంది. వీటితో పాటు నమోదైన వారి హాజరు శాతాన్ని కూడా పరిశీలిస్తోంది. నమోదైన వారి హాజరు శాతం చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేలకు పైగా అంగన్వాడి  కేంద్రాల్లో తక్కువ నమోదు ఉన్నట్లు ప్రభుత్వ అధికారుల గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. 

 

ఈ నేపథ్యంలో వీటిబలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆ శాఖ పరిశీలిస్తోంది.కొన్ని చోట్ల పిల్లలను పిలుచుకొని వచ్చుటకు ఆయాలు కేంద్రం నుంచి వెళ్ళనే వెళ్ళరు. టీచర్లు ఎప్పుడూ ఏదో ఒక మీటింగ్ , పల్స్ పోలియో, అని చెప్పి డుమ్మాలు కొట్టే పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నది. కొన్నిచోట్ల దగ్గరగా ఉన్న కేం ద్రాలను విలీనం చేసే టు వంటి అంశాన్నీ కూడాపరిశీలి స్తోంది. నమోదు సంఖ్యకు తగ్గట్లు అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లను నియమిస్తారు. దీనిపై నెలలో నివేదికలు రూపొందించాలని ఆయా  జిల్లా సంక్షేమాధికారులకు రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీలను ఉన్నతాధికారులు ఎక్కువ సంఖ్యలో పర్యవేక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. చాలామంది బాలింతలు తమకు ఇవ్వవలసిన ఆహారం కూడా అడిగిన రాలేదు అనే సమాధానం చెబుతారు. అది ఎంతవరకు నిజమో కనుక్కో వలసిన బాధ్యత అధికారుల మీద ఉంది బాగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: