జగన్ అధికారం లో కి వచ్చిన కొద్దీ రోజులోనే  నష్టాల్లో ఉన్నఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు .దీనితో అప్ కార్మికులు హర్షం వ్యక్తం చేసారు .. ఏపీ ప్రభుత్వం   తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా డిమాండ్ చేశారు. 52 రోజుల పాటు నిరవధిక  సమ్మె చేపట్టారు. అయితే తెలంగాణ  ప్రభుత్వం ఆర్టీసీకి షాకిచ్చారు. ఏ సమ్మె విషయం లో ఎన్నో ఘటనలు జరిగిన విషయం మనకు తెలిసింది  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేది లేదని తెగేసి చెప్పారు.

 

తాజాగే  ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి చేరాలన్నారు. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీల్ని పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిటీ బస్సుల  నుండి ఇతర జిల్లాలకు తిరిగే గరుడ, సూపర్ డీలక్స్ బస్సులకిన్నటికి కూడా బస్సు ఛార్జీలు పెంచారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో రెండు రకాలుగా బస్సు ఛార్జీలు అమలవుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ బస్సులు కూడా తెలంగాణలో కూడా తిరుగుతున్నాయి..

 

హైదరాబాద్‌తో పాటు  ఇతర ప్రాంతాల నుంచి కూడా విజయవాడ, విశాఖపట్టణంతం, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని నడపుుతోంది. ఇలాంటి సర్వీసుల్లో ఏపీ బస్సుల కంటే ఛార్జీలు తెలంగాణ బస్సులు ఎక్కువగా అయ్యే  అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల బస్సులు ఒకే రూట్లో తిరిగినప్పుడు రెండు రాష్ట్రాల బస్సుల్లో చార్జీల్లో లో బాగా  తేడా కనిపిస్తుంది . బస్సు ఛార్జీలు కిలోమీటర్‌కు 20 పైసలు పెరగనుండటమే ఇందుకు కారణం.

 

దీంతో ఏపీ బస్సుల్లో ప్రయాణమే జనం చౌకగా భావించే అవకాశం ఉంది. డితో ప్రజలు అప్ బస్సు లనే ఎంచుకొనే అవకాశం ఉంది .  ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రవాణాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య అవగాహన కుదుర్చుకునే  అవకాశం ఉందని అంటున్నారు . టీఎస్ఆర్టీసీ నుంచి కేవలం మూడు బస్సులే ఉన్నందున వాటిలో ఎక్కువగా పెంచబోరని,   అధికారులు నిర్ణయించే అవకాశం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: