హైదరాబాద్‌ నగరం లో ఆడవారిపై  జరుగుతున్న వరుస ఘటనలు  తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దిశా ఘటన  ఎవరు ఇంకా మరువలేదు  ,దిశా ఘటనపై దేశం అంతటా నిరసనల సెగలు వెల్లువఎత్తుతున్నాయి. కానీ  మానవ  మృగాలలో   మార్పు రాలేదు నిన్న పబ్‌లో సినీ తారపై అసభ్య ప్రవర్తన, నేడు సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళతో కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన తీరు చూసి ఆశ్చర్య పడుతున్నారు  హైదరాబాద్ జనం.

 

 వివరాల్లోకి వెళ్తే కొద్దిసేపటి క్రితం మహిళా సినీ ఆర్ట్ డైరెక్టర్‌పై ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ముగ్గురు మైనర్లు రెచ్చిపోయారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళా ఆర్ట్ డైరెక్టర్‌‌తో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెపై దాడికి పాల్పడ్డారు.సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళా ఆర్ట్ డైరెక్టర్‌‌ కారును ఢీ కొట్టిన ముగ్గురు మైనర్లు ఆమెపై దాడి చేశారు.

 

తన మీదపడి అసభ్యకరంగా ప్రవర్తించారు అని బాధితురాలు వాపోయారు .. ఈ ఘటనపై  బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు ఆమె .. పోలీస్ స్టేషన్‌లో  వారిపై  ఫిర్యాదు చేసింది.కారులో   మహిళా సినీ ఆర్ట్ డైరెక్టర్ ప్రయాణించింది. అది గమనించిన కొందరు ఆకతాయిలు ఆమె ప్రయాణిస్తున్న కారును ఫాలో అయి, ఆమె కారు ను  వెనుక నుంచి ఢీ కొట్టి ఆమెపైకి  దాడికి పాల్పడ్డారని చెప్పారు .

 

వారు అందరు  ఆమెను అసభ్యకరంగా తాకుతూ రెచ్చిపోయారని ఆ బాధితురాలు చెప్పారు .తనపై దాడి చేసిన ఆ మైనర్లు మరో 20 మందిని వెంట తీసుకొచ్చి తనను కొట్టారని, అసభ్యకరంగా మాట్లాడారని  బాధితురాలు చప్తున్నారు .  అసహ్యంగా తాకారని చోట తనని తాకుతూ తన ఇన్నర్స్ పట్టుకొని లాగారని, బట్టలు, ప్యాంట్ లాగారని చెప్పింది. వాళ్లలో మైనర్ లే    ఎక్కువగా ఉన్నారని చెప్పింది. వాళ్ళ భాష ఉర్దూలో ఉండటంతో వారు మాట్లాడేది నాకు సరిగా అర్తం కాలేదు అని ఆమె చెప్పారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: