జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అని అన్నారు. మనుషులతో కఠినంగానే మాట్లాడాలని సున్నితంగా మాట్లాడితే ఎవరూ వినరని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మానవత్వమే తన మతం మాట నిలబెట్టుకోవటమే తన కులం అని జగన్ అంటున్నారని మిగిలిన మతాలకు మానవత్వం లేదా...? మిగిలిన కులాలు మాట నిలబెట్టుకోవా..? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 
 
రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేసి పెట్టుకున్నాయని పవన్ అన్నారు. జనసేన పార్టీ మార్పు తెచ్చేందుకు కంకణం కట్టుకుందని ఎదురుదెబ్బలు ఉంటాయని ముందే తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పారు. న్యాయవాదులకు సరైన మౌలిక సదుపాయాలు కోర్టుల వద్ద లేవని అన్నారు. జనసేన పార్టీని ప్రజల కష్టాలను చూసి బాధ పడలేకే పెట్టానని పవన్ చెప్పారు. భవిష్యత్తు తరాల కోసమే కష్టపడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 
 
మనిషి సంకల్పానికి గాంధీ జీవితమే ఉదాహరణ అని పవన్ అన్నారు. తప్పులు చేసి వందల రోజులు జైలులో గడిపిన జగన్ రెడ్డే అధికారం కోసం అంత మంకుపట్టు పట్టాడని భావితరాల బాగు కొరకు ఆలోచించే నాకు అంతకంటే ఎక్కువ తపన ఉందని పవన్ చెప్పారు. సమస్యలపై ఓ సామాన్యుడి ఆవేదనే జనసేన అని పవన్ అన్నారు. నేను వెంటనే అద్భుతాలు చేస్తానని ఆశించకండి అని పవన్ అన్నారు. 
 
చట్టాలను కాపాడే నాయకులే దుర్భాషలాడుతున్నారని పవన్ అన్నారు. జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నేను గుర్తించను అని పవన్ అన్నారు. బత్తాయి చెట్లను చంపేస్తున్న వారిని ఎందుకు గౌరవించాలి..? అని పవన్ ప్రశ్నించారు. ఆరు నెలల్లో గొప్ప పాలన అని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. రాయితీ ధరకు ఉల్లిపాయలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: