యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇండియన్ మిషన్ స్కూల్ లో ఉద్రిక్త పరిస్థితులు చొటు చేసుకున్నాయి. స్కూల్ యాజమాన్యం ఒక విద్యార్థి అయ్యప్ప మాల ధరించి రావడంతో సీరియస్ అయింది. అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వచ్చాడనే కోపంతో 41 రోజులు విద్యార్థిని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై అయ్యప్ప భజన మండలి, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
భారీ సంఖ్యలో భజన మండలి, హిందూ పరిషత్ సభ్యులు స్కూల్ దగ్గరకు చేరుకొని నిరసన చేపట్టారు. విద్యార్థి బంధువులు స్కూల్ అద్దాలను ధ్వంసం చేశారు. మండల విద్యాశాఖాధికారి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత 15 రోజులుగా ప్రణీత్ రెడ్డి అనే విద్యార్థిని స్కూల్ యాజమాన్యం అయ్యప్ప మాల వేసుకున్నావని స్కూల్ కు రావద్దని హెచ్చరించింది. 
 
దాదాపు 50 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన చేపట్టారని సమాచారం. స్కూల్ టీచర్లు వ్యక్తిగత సమస్యల వలన అయ్యప్పమాలతో విద్యార్థి పాఠశాలకు వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. స్కూల్ యాజమాన్యంపై ఇప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనాకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. 
 
కానీ ఆందోళనకారులు శాంతించలేదు. మండల విద్యాశాఖాధికారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యానికి నోటీసులు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యం విద్యార్థిని అనుమతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. సామరస్యపూర్వకంగా ఈ వివాదం పరిష్కారం అయినట్లు తెలుస్తోంది. మిషనరీ సాంప్రదాయాలు ఒప్పుకోవని స్కూల్ యాజమాన్యం పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.విద్యార్థి ప్రణీత్ రెడ్డి ఇండియన్ మిషన్ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ప్రిన్సిపాల్ 41 రోజులపాటు స్కూల్ కు రావద్దంటూ సస్పెండ్ చేయడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: