2014 లో కెసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయాలి అంటేనే మీడియా భయపడే పరిస్థితి వచ్చింది. జాతీయ మీడియా మినహా స్థానిక మీడియా ఆయనపై కథనాలు రాయాలి అన్నా ప్రసారాలు చెయ్యాలి అన్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఆయనకు ఉన్న బలాన్ని, తెలంగాణాలో ప్రజలకు ఆయన ఉన్న మద్దతుని, ఆయన మనస్తత్వాన్ని చూసి చాలా వరకు మీడియా అధినేతలు భయపడ్డారు అనే ప్రచారం ఎక్కువగా జరిగింది.

 

ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది. కొన్ని ఛానల్స్ కి ఆయన చుక్కలు చూపించారు. నిషేధం కూడా వాటిపై జగన్ విధించారు. ఈ వ్యవహారం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇక అది పక్కన పెడితే ఇన్నాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని, కెసిఆర్ ని అన్ని విధాలుగా మోస్తూ వచ్చిన ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఇప్పుడు వారికి వ్యతిరేకంగా కథనాలు రాయ‌డం తెలుగు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

ఈ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు ఎవ‌రు వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది స‌ద‌రు మీడియా. చంద్రబాబు, పవన్ ప్రసంగాలకు ఆ ఛానల్ లో ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తోంది. కమ్మ సామాజిక వర్గ అధినేత కు చెందిన ఈ ఛానల్ లో వారికి సంబంధించి చిన్న వ్యతిరేక వార్త వచ్చినా సరే ప్రసారమవుతోంది. వారి నిర్ణయాలను ఆ ఛానల్ బహిరంగంగానే వ్యతిరేకించడం గమనార్హం.

 

ఇక అదే మీడియా జాతీయ స్థాయిలో ఆ ఛానల్ బిజెపిని కూడా తిట్టడం విశేషం. ఇటీవల మహారాష్ట్ర వ్యవహారంలో బిజెపి శైలిని అధికార దాహాన్ని ఆ ఛానల్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రజలు ఇలా అనుకుంటున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆ ఛానల్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: