బీజేపీకి ఇటీవల రాజకీయంగా శివసేన బిగ్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలో అడ్డగోలు అధికారంతో ఫడ్నవీస్ ను సీఎం సీట్లో కూర్చోబెట్టిన మోడీ, అమిత్ షా జోడీకి శివసేన మరోసారి షాక్ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిలిపేసింది.

 

 

సీఎం పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే మెట్రో రైలు షెడ్ నిర్మాణం ప్రాజెక్టును నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కూడా సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా ప్రకటించారు. గతనెల 29మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే బుల్లెట్ రైలు సహా మహారాష్ట్రలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

 

 

పెద్దఎత్తున భూ సేకరణ చేయాల్సి ఉండటంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై రైతులు, గిరిజనుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మెట్రో రైలు షెడ్ నిర్మాణం కోసం ముంబయి శివారులోని గోరేగావ్ ఆరే ప్రాంతంలో వేలాది చెట్ల నరికివేతపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: