ప్రపంచం రంగులు మారుతున్నది.  సూర్యుడు కట్టుకున్న ఎర్రని రంగును ప్రపంచానికి పులుముతున్నాడు.  ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతున్నది.  గతంలో కంటే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.  ఈ వేడి తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. బయటకు రావడం లేదు.  ఎండ ఎడాపెడా వాయించేస్తున్నది.  


ఈ తీవ్రత నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.  ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం లేదు.  దేశంలో వాడుతున్న ఇంధనాల వలన వేడి పెరుగుతున్నది.  కార్బన్ మోనాక్సయిడ్ వంటి వాటిని విపరీతంగా గాలిలో కలిసిపోవడం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  


ఈ అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.  పారిశ్రామికీకరణ, నవీనీకరణ పేరుతో చెట్లను నరికేస్తూ...కాలుష్యాన్ని పెంచేస్తున్నారు.  చెట్లు ఉంటేనే కదా వేడి తగ్గేది.  వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వలన ఎక్కడాలేని విధంగా  గాలి కాలుష్యం జరిగింది.  ఫలితంగా ప్రాణవాయువు తగ్గిపోయింది.  దీంతో మనిషి శ్వాస సంబంధమైన ఇబ్బందులు పడుతున్నారు.  శ్వాసకోశ వ్యాధులతో భయపడుతున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ప్రపంచంలో పారిశ్రామికీకరణ ప్రారంభమైన 1890 - 1900 మధ్య కాలంతో పోలిస్తే ఇప్పటి ఉష్ణోగ్రతలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.  ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో చల్లగా ఉండే యూరప్ వంటి దేశాలు కూడా ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఐరాస పేర్కొన్నది.  గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్‌ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్‌ టన్నుల మంచు కరిగిపోయిందని ఐరాస వివరించింది. ఒకవైపు ఎండలు పెరిగిపోతుండటంతో మంచు కరిగిపోతుంది.  సముద్రమట్టం పెరుగుతున్నది. దీంతో తీరప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి.  ఎండాకాలం వస్తే చాలు ఎప్పుడు లేని విధంగా 40నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఎల్ నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: