నెల్లూరు జిల్లా లో తెలుగుదేశం పార్టీ కి షాక్ తప్పదా? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . ఇన్నాళ్లు టీడీపీ కి దన్నుగా నిలిచిన బీద మస్తాన్ రావు , రవిచంద్ర లు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది . మస్తాన్ రావు కు గతం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యసభ టికెట్ ఇస్తానని చెప్పి చివరకు చెయ్యి ఇచ్చారని , అలాగే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడుతానని చెప్పి మోసం చేశారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు . ఎవరు దిక్కు లేకపోతే బీద మస్తాన్ రావు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారని , దీనితో ఆయనకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలిగిందని చెబుతున్నారు .

 

 పార్టీ అధికారం లో ఉన్నప్పుడు మధ్య లో వచ్చిన వారికి పెద్ద పీట వేసే చంద్రబాబు , కష్టకాలం లో మాత్రం మస్తాన్ రావు పేరు జపిస్తుంటారని ఆయన అనుచరగణం మండిపడుతున్నారు . ఇక మస్తాన్ రావు వైకాపా లో చేరితే రాజ్యసభ పదవి కట్టబెడుతామని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది . దాంతో వైకాపా లో చేరాలని మస్తాన్ రావు పై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం . ఇక మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర యాదవ్ కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పే అవకాశాలే మెండుగా కన్పిస్తున్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి . ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న రవిచంద్ర యాదవ్ , పార్టీని వీడితే టీడీపీ కి కోలుకోలేని దెబ్బేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

 

రవిచంద్ర కు జిల్లా లో యూత్ లో మంచి ఆదరణ ఉండడమే దానికి కారణమని అంటున్నారు . యాదవ్ సోదర ద్వయం టీడీపీ ని వీడకుండా బాబు , ఎలా అడ్డుకుంటారో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: