ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.  ఈ విషయం అందరికి తెలిసిందే.  ప్రస్తుతం దేశంలో ఉల్లి ఘాటు పెరిగింది.  ఘాటుతో పాటు ఉల్లి రేటు కూడా పెరిగిపోతున్నది.  సెప్టెంబర్ మాసంలో రావాల్సిన దిగుబడి రాకపోవడంతో ఉల్లి కొరత తీవ్రంగా ఏర్పడింది.  తీవ్రమైన ఈ కొరత కారణంగా ప్రజలు  నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఇబ్బందుల కారణంగా ఎక్కడా లేని విధంగా అవస్థలు పడుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, మహరాష్ట్రతో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా ఉల్లి పంట అధికంగా పడుతుంది. 


కానీ, ఈ సంవత్సరం ఉల్లి పంట పెద్దగా పండటం లేదు.  ఇది ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది.  ఈ ఇబ్బందుల కారణంగానే ఉల్లిని ప్రజలు వాడటం మానేస్తున్నారు.  కొంతమందికి తప్పడం లేదు.  తెలంగాణలో ఉల్లి ధరలు కొండెక్కుతున్నాయి.  అయితే, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉల్లి గురించి పోరాటాలు చేస్తున్నారు.  కానీ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం దీని గురించి ఎలాంటి మాటలను మాట్లాడటం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, మొన్నటి వరకు అతి తక్కువగా ఉన్న టమాటో ధరలు ఇప్పుడు అమాంతం కొండెక్కాయి.  ధరలు కొండెక్కడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఐదు పది నుంచి కొన్ని రోజుల క్రితం కేజీ టమాటో ధర రూ. 24కి చేరుకుంది.  ఈ ధరలు పైపైకి పెరిగిపోతూనే ఉన్నాయి.  ఇలా ధరలు పెరిగిపోవడం వలన ఇబ్బందులు  పడే అవకాశం ఉన్నది.  


తాజాగా టమాటో ధర రూ. 50 పెరిగినట్టుగా తెలుస్తోంది.  మొన్నటి వరకు కనీసం ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కూడా రావడం లేదని భయపడిన రైతులు ఇప్పుడు సంతోషిస్తున్నారు.  రాష్ట్రంలో ఉల్లితో పాటుగా టమాటో దిగుబాటులు కూడా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి.  దీంతో టమాటో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  పంటకు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయనే ఆశతో ఉన్నారు.  మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: