జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు కష్టపడితే కానీ రావని అన్నారు. తాను బీజేపీ, చంద్రబాబుతో కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు ఈ విషయంలో దండం పెట్టాలని పవన్ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ తను బీజేపీ, టీడీపీ పార్టీలతో కలిసి పోటీ చేయకపోవటం వలనే జగన్ సీఎం అయ్యారనే విధంగా వ్యాఖ్యలు చేశారు. 
 
పవన్ కళ్యాణ్ తాను బీజేపీ పార్టీకి ఎప్పుడూ దూరంగా లేనని చెప్పారు. బీజేపీ పార్టీతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే తాను విభేధించానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కోసం, దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి కష్టపడితే తప్ప రావని పవన్ కళ్యాణ్ అన్నారు. కియాలాంటి పరిశ్రమ సీఈవోను బెదిరిస్తే రాష్ట్రానికి ఎవరు వస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 
 
నా వ్యాఖ్యలను ఆంగ్ల మాధ్యమం విషయంలో వక్రీకరించారని ఆంగ్ల మాధ్యమంను నేను పూర్తిగా వ్యతిరేకించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగును పరిపాలనా భాషగా అమలు చేయాలని పవన్ చెప్పారు. నా వ్యాఖ్యలను వైసీపీ హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై కూడా వక్రీకరించిందని పవన్ అన్నారు. అన్యమత ప్రచారం తిరుమలలో ఎక్కువగా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారని పవన్ అన్నారు. 
 
సామూహిక మత మార్పిడులు రాష్ట్రంలో ఎవరి అండతో జరుగుతున్నాయని పవన్ ప్రశ్నించారు. కేంద్రాన్ని కడప ఉక్కు పరిశ్రమ గురించి అడగకుండా యురేనియం శుద్ధి పరిశ్రమ గురించి అడుగుతారా...? అని పవన్ ప్రశ్నించారు. రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని పవన్ అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉల్లి అందించలేకపోయిందని, పసుపు రైతులకు అండగా నిలబడలేకపోయిందని పవన్ అన్నారు. రాయలసీమ వెనుకబడిపోయిందని అంటున్నారని ప్రభుత్వం అలాంటి పరిస్థితులు కావాలనే కల్పిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: