మొన్నటి వరకు ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరి బిక్కిరి అయిన తెలంగాణ సర్కార్. ఇప్పుడు ఆ సమస్య ముగియడంతో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. ఈ ఉద్దేశంతోనే తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు ఢిల్లీకి పయనమయ్యారు అని మీడియా వర్గాలు అనుకున్నాయి. కానీ, ఆయన ప్రధానితో భేటీ కాకుండా ఢిల్లీలో ఒక పెద్ద వారి ఇంటి పెళ్ళికి వెళ్లి, అట్నుంచి అటే తన దంత సమస్యలకు సంబంధించిన వైద్యం కోసం సంప్రదించి హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

 

నిజానికి, ఈ పర్యటనలో కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ కావాల్సి ఉంది. కానీ, మోడీ బిజీ షెడ్యూల్ కారణంగా కలవకుండా హైదరాబాద్ వచ్చేశారు  అని తెలుస్తుంది. ఇటువంటి సమయంలో ఆయన కుమారుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ నిర్వహించిన సదస్సుకు హాజరు అయిన కేటిఆర్ ప్రధాన మంత్రి పై తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే కేంద్ర పరిపాలన పై తప్పులు ఎత్తి చూపారు.

 

ఇప్పటికే, అనేక రాష్ట్రాలు మోడీ సర్కార్ పై వారు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేవలం అభివృద్ధిని కేవలం కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం చేస్తోందని చెప్పారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు రావడం లేదని చెప్పారు.

 

అలాగే మంజూరు అయిన ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి మొత్తం గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, చెన్నై లాంటి పెద్ద నగరాలకే పరిమితం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించాడు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినా.ఇవ్వకపోవడం వల్ల ఇలా మాట్లాడారు అని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి చూడాలి దీనికి బీజేపీ వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో .

మరింత సమాచారం తెలుసుకోండి: