భారత దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం... ఎందుకు ? ఇన్నాళ్ళుగా ఈ వ్యాఖ్య వినపడుతూనే ఉంటుంది అంటే... జనాల్లో ఆకలి కేకలు ఎక్కువ... పెరుగుతున్న జనాభాకు ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు అభివృద్ధి చేయడమే గాని ఎవరికి వారు అభివృద్ధి మీద దృష్టి పెట్టి.. అభివృద్ధి కావాలి అని కోరుకునే పరిస్థితి గాని అందుకు తగిన ఆలోచనలు గాని చెయ్యరు. ప్రభుత్వాలు చేస్తే నోరెళ్ళబెట్టి చూడటమే గాని... ఎవరూ కూడా అభివృద్దిని కోరుకోరు.

 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దీన్నే గమనించారు. ప్రజలు నిజంగా అభివృద్ధి కోరుకుని ఉంటే... చంద్రబాబు పరిస్థితి అలా ఉండేది కాదనే విషయం జగన్ కు అర్ధమైంది. అందుకే ఆయన పెరిగిన సంపదను ప్రజలకు పంచాలి అనే నిర్ణయానికి వచ్చారు. ముందు ప్రజల కష్టాలను తీర్చాలని భావించారు. అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగం ఉండదని ముందు ప్రజల బ్రతుకులు బాగుపడితే ఆ తర్వాత అభివృద్ధి దాని అంతట అదే జరుగుతుందని... తద్వారా ఆదాయం అదే పెరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సంక్షేమ౦ మీద ఆయన దృష్టి పెట్టారు.

 

పూట గడవని వాడికి విద్యుత్ దీపాలు ఎందుకు అనే ఆలోచనలో ఉన్న జగన్ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆదాయ వనరులు పెంచడంతో పాటు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం మీద ఆయన దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. క్రమంగా ఆదాయం పెరుగుతుంది... అప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది అని జగన్ భావిస్తున్నారట. మంత్రులు కూడా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచే ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా జ‌నం నాడి ప‌ట్టుకునే విష‌యంలో చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు చాలా తేడా ఉంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: