ఒక వైపు దిశా ఘటన మరువక ముందే యూపీలో మరో ఘోరం జరిగి పోయింది. 20 ఏళ్ల అత్యాచార బాధితురాలి కోర్టుకు వెళుతుండగా దుండగులు కిరోసిన్ పోసి నిప్పు అంటించడం జరిగింది. ఈ దాడిలో యువతి శరీరం 90 శాతం కాలిపోయింది. బాధితురాలిని  హుటాహుటిగా లక్నో ఆసుపత్రికి  తరలించడం జరిగింది. తాజాగా ఈ సంఘటన ఉన్నావ్‌ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... గత మార్చిలో ఐదుగురు ఈ యువతిపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలియ చేయిస్తున్నారు. ఇక అరెస్టు అయినా వారిలో ఒకరు బెయిల్ పై విడుదల అవగా.. తాజాగా జరిగిన దాడిలో అతను కూడా ఉండడం గమనార్థకం. పరారిలో  ఉన్న  ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఉన్నావ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి విక్రాంత్‌ విర్‌ తెలియచేయడం జరిగింది.

 

వీరిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలియచేయడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న దారుణాలపై ఓ వైపు గొంతెత్తుతుంటే మరో వైపు చాపకింద నీరులా ఇలా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఉన్నావ్‌లో తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశారని ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలియచేయడం జరిగింది.

 


ఇక ఇద్దరు నిందితుల్లో ఒకరిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేయగా అతను బెయిల్‌పై విడుదల అవ్వడం జరిగింది. మరో నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్‌ చేయకపోవడం గమనించ వలసిన విషయం. నిందితుడి ఆస్తులను అటాచ్‌ చేసి ఆయనపై లుక్‌అవుట్‌ నోటీస్‌ చేయడం జరిగింది అని పోలీసులు తెలియజేస్తున్నారు.

 

ప్రస్తుతం బాధితురాలిని కాపాడటమే తమ ముందున్న కర్తవ్యమని పోలీసులు తెలియచేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్‌ చేశామని, లైంగిక దాడి నిందితుడి బెయిల్‌ దరఖాస్తును స్ధానిక పోలీసులు వ్యతిరేకిస్తారని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ స్పష్టం తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: