మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన హనీట్రాప్ లాంటిదే కర్ణాటకలోనూ ఒకటి బయటకు వచ్చింది. ఇక్క‌డ కూడా ష‌రా మామూలే. అంద‌మైన అమ్మాయిల‌ను ప‌లువురు రాజ‌కీయ నేత‌ల ద‌గ్గ‌ర‌కు పంపిస్తారు. అక్క‌డ ఆ అమ్మాయిలు వారిని ట్రాప్ చేసి వారిని ముగ్గులోకి దింపి వారితో రాస‌లీల‌లు కొన‌సాగిస్తూ వీడియోలు తీస్తారు. ఇక ఆ త‌ర్వాత ఆ వీడియోలు చూపించి.. వారిని బ్లాక్ మెయిల్ చేసి డ‌బ్బులు గుంజుతుంటారు. సేమ్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఏ త‌ర‌హాలో అంద‌మైన అమ్మాయిల‌తో హ‌ని ట్రాప్ చేశారో ఇప్పుడు క‌ర్నాట‌క‌లోనూ ఇదే త‌ర‌హాలో హ‌ని ట్రాప్ ముఠా చాలా మందికి అమ్మాయిల‌ను ఎర‌వేసి బ్లాక్ మెయిల్ చేసింది.



ఇక ఎవ‌రు ఎన్ని చీక‌టి ప‌నులు చేసినా వారి గుట్టు ర‌ట్టు కాక త‌ప్ప‌దుగా.. ఈ క్ర‌మంలోనే ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఒకడు పోలీసులకు చిక్కాడు. వీళ్ల బండారం ఎట్ట‌కేల‌కు బ‌య‌ట ప‌డింది. వీడు తన గర్ల్ ఫ్రెండ్ ను  మొదలుకుని పలువురు అమ్మాయిలను వాడి... అనేక మంది రాజకీయ నేతలు, ప్రముఖులను ఇలా టార్గెట్ చేశాడట. మ‌రో ట్విస్ట్ ఏంటంటే అత‌డు ఎర‌వేసిన వాళ్ల‌లో కొంత మంది హీరోయిన్లు కూడా ఉన్నార‌ట‌.



ద‌క్షిణాదిలో పాపుల‌ర్ అయిన ఇద్ద‌రు, ముగ్గురు హీరోయిన్ల‌ను కూడా అత‌డు నేతలకు, ప్రముఖులకు ఎరగా వేశాడని తెలుస్తోంది. ఆ రాసలీలలను కూడా చిత్రీకరించి.. బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ సాగుతూ ఉంది, అనేక మంది ప్రముఖులు, కర్ణాటక  రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్టుగా వారు గుర్తించారు. దీనిపై ఓ వైపు పోలీసుల విచార‌ణ సాగుతోంది.



అయితే దీనిపై ఏ రాజ‌కీయ నాయ‌కుడు నోరు మెద‌ప‌డం లేదు. ఇందుకు కార‌ణం చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు ఈ హ‌ని ట్రాప్‌లో చిక్కుకోవ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. ఇక ద‌క్షిణాదిలో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన మీడియం రేంజ్ హీరోయిన్లు ఇద్ద‌రు కూడా ఇందులో ఉన్నార‌ట‌. మ‌రి ఆ హీరోయిన్లు ఎవ‌రో ... వీరి వ‌ల‌లో చిక్కుకున్న ఆ రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: