దేశంలో ఆర్థిక మాంద్యం సూచనలు బాగా కనిపిస్తున్న వేల అందరి కళ్ళు కూడా ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మీద ఉంచారు. కానీ ఆర్బీఐ అందరి ఆశలను ఆవిరి చేస్తూ ఎటువంటి మార్పులు లేకుండా ప్రస్తుతం కొనసాగుతున్న రేట్లను కొనసాగించాలి అనుకుంటున్నట్లు తెలియజేసింది. వృద్ధిరేటు గత దశాబ్దంలోనే అత్యల్ప స్థాయికి వెళ్లిన ఈ సంవత్సరంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో రేట్ల కోత ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి.

 

కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్బీఐ  సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మార్కెట్ కూడా అంచనాలకు ఆర్బిఐ నిర్ణయం లేకపోవడంతో వెంటనే నష్టాలకు వెళ్లిపోయాయి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష కమిటీలో ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, డాక్టర్ చేతన్, డాక్టర్ పమీ దువా, డాక్టర్ రవీంద్ర,డాక్టర్ హెచ్ డి దోలకియా, మైకేల్ దేబ బర్త ఉన్నారు. అందరూ కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

 

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఆర్బీఐ తగ్గించింది. గతంలో ఉన్న 6.1 శాతం 5% కు తీసుకొని వచ్చింది, కొన్ని రోజుల వరకు రిటైల్  ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందనిbank OF INDIA' target='_blank' title=' ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> ఆర్బిఐ పేర్కొంది. కానీ 2020-21 రెండవ అర్ధ భాగానికి ఇది నిర్దేశిత లక్ష్యం కంటే తక్కువగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5.1 నుంచి 4.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2020-21 తొలి అర్ధ భాగంలో ఇది 4.౦ నుంచి 3.8 మధ్యలో ఉండవచ్చని ఆర్.బి.ఐ అంచనా వేస్తోంది. దీని వల్ల గృహ రుణాలు తీసుకున్న వాలు తమ ఈఎంఐ తగ్గుతాయి అణా ఆశలు ఆవిరి అయ్యాయి. డిపాజిట్లు పై వచ్చే వడ్డీ కూడా దీని వల్ల తగదు. మార్కెట్ వర్గాలు ఈ విషయం ఎలా తీసుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: