పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  రాయలసీమలో ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు మదనపల్లిలోని టమాటో మార్కెట్ ను సందర్శించారు.  మొదట పవన్ అక్కడ పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేదు.  ఆ తరువాత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వకుంటే రోడ్డుమీదనే కూర్చుంటా అని పవన్ చెప్పడంతో చేసేది లేక పోలీసులు అనుమతి ఇచ్చారు.  


ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ మదనపల్లి వెళ్లి అక్కడి రైతులతో ముఖాముఖీగా మాట్లాడారు.  రైతులను కలిసిన పవన్ కళ్యాణ్ టమాటో రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు.  రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి తప్పించుకుంటున్నారని అన్నారు.  


రైతుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  లేదంటే రైతుల తరపున పోరాటం చేస్తానని అన్నారు.  ముందు రైతులకు అన్నం పెట్టాలని, ఆ తరువాత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టుకోవాలని అన్నారు.  జగన్ ప్రభుత్వం మత మార్పిడిపై పెట్టిన శ్రద్ద రైతులపై పెట్టడం లేదని అయన మండిపడ్డారు.  రైతుల సంక్షేమం కోసం వస్తే తనను ఎక్కడికక్కడ ఆపాలని చూస్తున్నారని అన్నారు.  


తనను ఆపితే చేతులు కట్టుకొని కూర్చోనని, తనను ఆపాలని చూస్తే.. మిమ్మల్ని కూలుస్తానని పవన్ ఆవేశంగా మాట్లాడారు.  ప్రభుత్వం తమ శ్రద్ద మొత్తం మత మార్పిడిపై మాత్రమే పెట్టిందని అన్నారు.  రైతుల పై కూడా శ్రద్ద పెట్టాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.  రైతులకు భరోసా ఇవ్వకుంటే కనుక తాను అమరావతిలో ప్రదర్శన చేస్తానని అన్నారు.  తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: