కడప జిల్లా వాసులకు ఎన్నో సంవత్సరాలుగా కేవలం కలగా మిగిలిన కడప జిల్లా ఉక్కు కర్మాగారానికి జగన్ ప్రభుత్వంలో మోక్షం లభించడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ నుంచి విడిపోయే సమయంలో కేంద్ర ప్రభుత్వం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు మొన్న జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైయస్సార్సిపి పార్టీ ఈ హామీ నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది.

 

దానిలో తొలి అడుగుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26వ తేదీన ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె- పెద్ద దండ్లూరు ఊరు గ్రామ పరిధిలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఈ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి మన రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, మైనింగ్ శాఖ కార్యదర్శి డైరెక్టర్గా నిర్వహిస్తూ ఈ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

మన ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ప్రకారం యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన వైఎస్ జగన్ ఇందులో భాగంగా కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేగాక సొంత జిల్లా కావడంతో ఇది ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి అసలు కారణమని కొందరు చెబుతున్నారు.

 

2013 కంపెనీ చట్ట ప్రకారం ఏర్పడిన ఈ కంపెనీ హై గ్రేడ్ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో రిజిస్టర్ చేయబడింది. ఇందులో పెట్టుబడులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలిపారు. 2019- 20 బడ్జెట్ లో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం దాదాపు 250 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ, ప్రజల మనసులో చిరకాల సీఎం గా నిలవాలని జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: