ప్రపంచాన్ని భయపెడుతున్న పెద్ద సమస్యల్లో ఒకటి ప్లాస్టిక్.  ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. అనేక ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోతున్నాయి.  అయితే, ఈ ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కలిసిపోవాలి అంటే వేల సంవత్సరాలు పడుతుంది.  కేవలం భూమిమీదనే ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి అనుకుంటే పొరపాటే.. మనిషి చేసిన మూర్ఖత్వమైన పొరపాట్ల కారణంగా సముద్రాల్లో వేల టన్నుల ప్లాస్టిక్ ఉండిపోతున్నది. 


వాడిపారేసే ప్లాస్టిక్ ను చాలామంది భూమిపై కాకుండా సముద్రాల్లో పడేస్తున్నారు.  ఇక జాలరులు కూడా తెగిపోయిన వలలు, తాళ్లను సముద్రంలో పడేస్తున్నారు.  అవన్నీ కూడా సముద్రంలో తేలుతున్నాయి.  పాపం సముద్రంలో జీవించే చాలా జీవులు ఆ ప్లాస్టిక్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి.  ప్లాటిక్ వలలకు చిక్కుకొని చనిపోతున్నాయి.  సముద్రంలో ఉండే జీవులు అవి పడుతున్న బాధలు మనుషులకు పెద్దగా తెలియకపోవచ్చు.  


ఒక్కోసారి అలా సముద్రంలో బాధపడుతూ అవి ఒడ్డుకు కొట్టుకొని వస్తుంటాయి.  అలా వచ్చినపుడు  కొన్నిసార్లు  మానవతా దృక్పధంతో కొన్ని కన్నీళ్లు కరుస్తుంటారు.  ఇటీవలే హారిస్ బీచ్ కు 20 టన్నుల బరువుండే తిమింగలం ఒకటి కొట్టుకొని వచ్చింది.  అలా వచ్చిన ఆ తిమింగలం మరణించింది.  వెంటనే అధికారులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న అధికారులు తిమింగళాన్ని పోస్ట్ మార్టం చేయగా.. దాని కడుపులోనుంచి తాళ్లు, వలలు, కప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లు వంటివి 100 కేజీలు బయటకు వచ్చాయి.  


అలా బయటకు దీంతో అధికారులు ఆ తిమింగళాన్ని అక్కడే పాతిపెట్టారు.  ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.  ఇలాంటి మరణం ఎవరికీ రాకూడదని అంటున్నారు.  మనిషి చేస్తున్న పాపాలకు ఎన్ని జంతువులు ఇలా బలికావాల్సి వస్తున్నదో తెలిస్తే షాక్ అవుతారు.  మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడో అర్ధం కావడం లేదు.  ఈ భూమిపై మనిషి ఒక్కడే కాదు.. మనతో పాటు ఎన్నో జీవరాసులు కూడా భూమిపై నివసిస్తున్నాయి అని తెలుసుకుంటే మంచిది.  లేదంటే మాత్రం ఇలానే జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: