సజ్జనార్ .. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎవరి నోటా విన్న ఈ పేరే విన్పిస్తోంది . దిశ అత్యాచార , హత్య ఘటన నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడం తో సజ్జనార్ పేరు మారుమోగిపోతోంది .  సోషల్ మీడియా లో ఇప్పుడు రియల్ హీరోగా అయన కీర్తింపబడుతున్నారు . అయితే ఇంతకీ ఎవరు ఈ  సజ్జనార్ ? అన్న ప్రశ్న  తలెత్తకమానదు . కర్ణాటక కు చెందిన విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ 1996 బ్యాచ్ కు చెందిన ఐ పీఎస్ అధికారి . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ హోదాల్లో అయన విధులు నిర్వహించారు .

 

తాను ఏ బాధ్యతలు నిర్వహించిన తనదైన ముద్ర వేశారు . వివిధ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన సజ్జనార్ , రౌడీ మూకలను పీచ మణిచారు .  ఏ జిల్లాల్లో పనిచేసినా, ఆ జిల్లాలో  సంఘ విద్రోహుల భరతం పట్టడంలో, సజ్జనార్  కీలకంగా వ్యవహరించారు .   వరంగల్ లో యాసిడ్ దాడి నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన సమయం లో  ఆ  జిల్లా ఎస్పీ గా సజ్జనారే  విధులు  నిర్వహిస్తున్నారు . ఇక మెదక్ జిల్లా ఎస్పీ గా బాధ్యతలు నిర్వహించే సమయం లో ఒక కానిస్టేబుల్ ను హత్య చేసిన గంజాయి స్మగ్లర్ ను ఎన్ కౌంటర్ చేశారు .

 

 ఆక్టోపస్ ఐజి గా విధులు నిర్వహిస్తున్న సమయం లో వికారుద్దీన్ గ్యాంగ్ ఎంకౌంటర్ లో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు . ఇక నహీం ఎన్ కౌంటర్ లోను సజ్జనార్ లీడ్ చేశారన్న ఊహాగానాలు ఉన్నాయి . తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక ఎన్ కౌంటర్ లలో కీలక పాత్ర పోషించిన సజ్జనార్ పై తెలుగు  రాష్ట్రాల  ప్రజలే కాకుండా, దేశ వ్యాప్తంగా ప్రజలు  ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: