దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన   షాద్ నగర్ దిశ  హత్యాచార  నిందితుల పోలీసులు  ఈరోజు తెల్లవారుజామున  ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్  చేయడానికి  నలుగురు  నిందితులను  సంఘటన స్థలానికి తీసుకెళ్లగా  నిందితులు  పోలీసుల పై తిరగబడ్డారు. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరుపుగా  నలుగురు దోషులు.. మహమ్మద్ ఆరిఫ్ , జొల్లు శివ , జొల్లు నవీన్ , చెన్న కేశవులు   అక్కడికక్కడే మృతి  చెందారు. ఇక ఎన్ కాంటర్ పై దేశవ్యాప్తంగా  హర్షాతిరేకాలు  వ్యక్తం అవుతున్నాయి.  ముఖ్యంగా ఈకేసును  డీల్ చేసిన  సీపీ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.  సెలబ్రెటీలు కూడా ఈ ఎన్ కౌంటర్ ను స్వాగతిస్తూ  ట్వీట్లు  చేస్తున్నారు. 
 
 
అందులో భాగంగా  మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్ కౌంటర్ పై స్పందించారు. దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం,సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే.అత్యంత దారుణంగాహత్యచారానికి గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న దిశ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది.
 
 
ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి.   వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలని  మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: