తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబం మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో సిని పరిశ్రమ కూడా ఉంది. సిని పెద్దలతో కేటిఆర్ సన్నిహితంగా మెలిగారు. సిని కార్యక్రమాలకు ఆయనకు ప్రత్యేక అతిథిగా కూడా హాజరు అయ్యారు. ఇక సిని పెద్దలు కూడా భయపడ్డారా లేదా టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌చారా కార్య‌క్ర‌మాలు వారిని అంత‌గా ఆక‌ర్షిచాయా ? అన్న‌ది తెలియదు గాని... ప్రహుత్వానికి మంచి ప్రచారమే చేసారు. హరిత హారం విషయంలో సిని ప్రముఖులు తెరాస కార్యకర్తల కన్నా వేగంగా స్పందించారు. కెసిఆర్ ఇచ్చిన పిలుపుతో మొక్కలు నాటే కార్యక్రమాలు చేసారు.

 

ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చెరువు పూడ్చి కట్టారని నాగార్జున కు చెందిన యెన్ కన్వెన్షన్ సెంటర్ పై ప్రభుత్వం దాడులు చేసింది. ఆ త‌ర్వాత నాగ్ టీఆర్ఎస్‌తో... ముఖ్యంగా కేటీఆర్‌తో క్లోజ్ రిలేష‌న్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేటిఆర్ ని సిని పరిశ్రమ కుటుంబ సభ్యుడిగా చూసుకుంది. ఆయనను ప్రతీ కార్యక్రమానికి సిని పరిశ్రమ ఆహ్వానించింది అంటేనే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు సిని పరిశ్రమ ఎందుకో కేటీఆర్‌కు దూరం దూరంగా ఉంటోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

కేటిఆర్ తో స్నేహం చెయ్యాలి అంటేనే చాలా మంది ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు జంకుతున్న‌ట్టు భోగ‌ట్టా.. ! సినిమా వాళ్ల‌పై వరుసగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఆయనతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్న వారు, ఈ ఐటి దాడుల బాధితుల జాబితాలో ఉన్నారు. త్వరలోనే మరికొందరి మీద ఐటి దాడులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనితో కేటిఆర్ తో దూరంగా ఉంటే మంచిది అనే భావనలో టాలివుడ్ పెద్దలు ఉన్నారు.

 

ఇక ఆయన్ను సిని కార్యక్రమాలకు పిలవడానికి భయపడే పరిస్థితి వచ్చిందట. త్వరలోనే మరికొందరి మీద దాడులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరు అగ్ర హీరోలు అయితే కేటిఆర్ ని కలవడం కూడా మానేసినట్టు సమాచారం. ఇక మరికొందరు అయితే మా మీద నిఘా పెట్టారు అనే భయంలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: