ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పుడు కొన్ని శక్తులు అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షలతో రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఎక్కువగానే జరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు అవి లబ్దిదారులకు అందుతున్న తీరుపై విపక్షాలు ఓర్వలేని విమర్శలే చేస్తున్నాయి. రాజకీయంగా తమ మనుగడ ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం విషయాన్ని వదిలేసి ఇన్ని అప్పులు చేసారు అన్ని అప్పులు చేశారూ అంటూ ఆరోపిస్తున్నారు.

 

వాస్త‌వంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లే అయ్యింది. సంక్షేమ ప‌థ‌కాల నేప‌థ్యంలో జ‌గ‌న్ కొద్దిగా అప్పులు ఎక్కువ‌గానే చేసిన మాట వాస్త‌వం. అయితే ఇప్పుడు జగన్ ఆదాయం మీద దృష్టి పెట్టారు. ఆ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టే ప్రయత్నాల్లో భాగంగా, ఇప్పటి వరకు తన ప్రభుత్వం చేసిన అప్పుని తానే తీర్చే ఆలోచన జగన్ చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఆయన... ఇప్పుడు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టనున్నారు. 

 

ఇక నుంచి వచ్చే అప్పులను అభివృద్ధి కార్యక్రమాల మీద వెచ్చించే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరడంతో ప్రజలకు పనులు దొరుకుతున్నాయి వర్షాలు కూడా సమృద్దిగా పడటంతో వ్యవసాయం మీద రాబడి, రైతుల ఆర్ధిక పరిస్థితి కూడా బాగుంది. ఇక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసి కనీసం అభివృద్దిలో అయిన మీ సహాయం కావాలని కోరగా అందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 

 

ఇప్పుడు అమరావతి పనులు కూడా మొదలుపెట్టారు. అవి కూడా త్వరలో పూర్తి స్థాయిలో మొదలు అయితే పెట్టుబడులకు కూడా ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇక ఆదాయం కోసం కొన్ని రంగాలను కూడా ప్రోత్సహించే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఆయన అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే మరో మూడేళ్ళల్లో రాష్ట్రం అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: