తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటం తో ఎన్‌ కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్‌ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు.

 

దిశ ఎన్‌కౌంటర్ జరిగి 24 గంటలైనా గడవనే లేదు.. మహిళలపై వేధింపుల పరంపర కొనసాగు తోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఓ మహిళ పట్ల నలుగురు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు మూకుమ్మడిగా తిరగబడి ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేయగా మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం.

 


మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఓ మహిళ పట్ల నలుగురు యువకులు అసభ్యం గా ప్రవర్తించారు. అసభ్యకర మాటల తో.. వికృత చేష్టల తో వేధింపులకు గురిచేశారు. మహిళ విషయాన్ని కుటుంబ సభ్యలకు, గ్రామస్థులకు తెలియజేయడం తో వారిని వెంబడించి పట్టుకునే  ప్రయత్నం చేశారు. ఇద్దరు యువకులు చిక్కడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారైనట్లు తెలుస్తోంది. పరారైన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

యువకుల కోసం అప్పుడే గ్రామానికి చెందిన కొందరు నేతలు రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పరారైన యువకులకు నేర చరిత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిలో ఒకరిపై రౌడీ షీట్, మరొకరిపై సస్పెక్ట్ రౌడీ షీట్ ఉందని.. కొద్ది నెలల క్రితం కౌన్సెలింగ్ కు వచ్చి పారిపోయిన రౌడీ షీటర్‌గా అనుమానిస్తున్నారు. ఈ విషయం పై  బాధిత కుటుంబాన్ని , అఘాంతకుడు కుటుంబాన్ని కలిసిన పోలీసులు విచారణలో మరింత జోరు పెంచారని తెలుస్తోంది...మరి వారికి ఈ శిక్ష పడుతుంది అనే విషయం తెలియాల్సి వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: