బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ మధ్య అంతర్గత పోరు జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు.. గవర్నర్ వాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. గవర్నర్ స్థాయి వ్యక్తి సాక్షాత్తూ ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. గతంలో ఓసారి ఇలాంటి వ్యాఖ్యలే చెసిన గవర్నర్ మరోసారి మాటల యుద్ధం చేశారు. దసరా పండుగ సందర్భంలో దీదీ నివాసంలో జరిగిన దుర్గా పూజ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. అయితే ఆ పూజకు హాజరైన తాను ఆ సమయంలో సీఎం ఇంట్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు గవర్నర్ తెలిపారు.

 

 

‘ఔరంగజేబు రాజ్యానికి వెళ్లి అవమానపడ్డ శివాజీలా అయ్యింది నా పరిస్థితి’ అంటూ సీఎంపై విమర్శలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌ ఈస్ట్‌ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంలో గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మమతాబెనర్జీ, గవర్నర్‌ మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అక్టోబరు 11న జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కూడా పాల్గొన్నారు. ఆనాటి పూజ సందర్బంగా జరిగిన విషయాలపై స్పందించిన జగదీప్‌.. 1666లో ఔరంగజేబు తన పుట్టినరోజు సందర్భంగా శివాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. అయితే అప్పుడు శివాజీని సభలో సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపర్చాడు. అలా ముఖ్యమంత్రి కూడా తనను ఇంటికి పిలిచి అవమానించారని గవర్నర్‌ ఆరోపించారు.

 

 

మమతాబెనర్జీని నేను ఔరంగజేబుతో పోల్చట్లేదు. బహుశా.. నాకు జరిగినట్లుగా ఏ రాష్ట్ర గవర్నర్‌కు జరగలేదేమో..! దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆ కార్యక్రమం మొత్తం అధికారిక మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారమైంది. అయితే.. అందులో గవర్నర్‌ను కనీసం నాలుగు సెకన్లు కూడా చూపించలేదు’ అన్నారు. బెంగాల్‌లో పాలన అస్తవ్యస్తంగా మారుతోందని, ఈ విషయంలో తాను చాలా ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: