ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి ఆదివారం బంగారు ఆభరణం సమర్పించారు. ఈ బంగారు ఆభరణం విలువ 7 లక్షలు రూపాల వరకూ ఉంటుంది. సుమారు 113 గ్రాములు బరువు ఉన్న అన్‌కట్‌ డైమండ్‌ నెక్లెస్‌ను సీఎం కానుకగా అందించారు. ఈ కానుకను సీఎం జగన్ మోహన్ రెడ్డి తరఫున టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆలయ అధికారులకు అందజేశారు.

 

తిరుచానూరులో పంచమితీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని సి.ఎమ్. జగన్ మోహన్ రెడ్డి ఈ కానుకను సమర్పించుకున్నారు. ఇటీవల వైఎస్ జగన్ సర్కారుపై మతపరమైన ముద్ర వేయాలన్న ప్రయత్నం జోరుగా సాగుతోంది. ప్రతిపక్షలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు జగన్ పై ఓ మతానికి చెందిన వాడి గా ముద్ర వేసే తరహాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీటీడీలో అన్యమతస్తుల పెత్తనం సాగుతోందని విమర్శిస్తున్నారు.

 

సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కరెక్టు కాదని ఆరోపించారు. ఇక తాజాగా టీటీడీ క్యాలండర్లో ఇతర మతస్తుల నినాదాలు కనిపించాయన్న వివాదం కూడా కలకలం రేపింది. ఇన్ని ఆరోపణల మధ్య జగన్ అమ్మవారికి కానుక సమర్పించడం విశేషం.

 

అయితే.. పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విశేషమైన పంచమి తీర్థం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రలు సమర్పించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: