మన దేశంలో గాలి జనార్దన్ రెడ్డి తెలియని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. లక్షల కోట్ల మైనింగ్ స్కామ్ లో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి. ఈయనకి ఇద్దరు సోదరులు ఉన్నారు వారి పేర్లు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి . ఒకప్పుడు బళ్లారి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుండేది అలాంటి కంచుకోటలో కూడా బీజేపీని పగ్గాలు చేపట్టే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి జనార్దన్ రెడ్డి.

 

2008లో బీఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో టూరిజం శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు కూడా నిర్వహించారు. వెనుకబడిన కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేశారు గాలి జనార్దన్ రెడ్డి. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు పది వేల మందికి ఉపాధి, అలాగే పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించారు. ఈయన గురించి మనం యూట్యూబ్ లో ఎన్నో వీడియో చూడగలుగుతారు.

 

కానీ ,ఇప్పటి వరకు ఈయన మీద ఎటువంటి సినిమా రాలేదు. కానీ త్వరలో అది నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దీనికి దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈయనపై అక్రమ మైనింగ్ కేసులో మొదలయ్యాయి. బళ్లారి ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆయన మీద చాలా కేసులు వచ్చాయి. మొత్తానికి  తక్కువ రాయల్టీ చెల్లించి,  అలాగే అడవి భూములను ఆక్రమించడం కూడా చేశారు అని ఆరోపణలు ఉన్నాయి.

 

2009లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయనపైన చర్యలు తీసుకుంది. ఆ కేసు సంబంధంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి హైదరాబాదులోని చంచల్ గూడా జైలుకు తరలించారు. అప్పుడు ఆయన నుంచి రెండు హెలికాప్టర్లు దాదాపు 20 కోట్ల విలువ చేసే కార్లని పోలీసులు సీజ్ చేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. అందరికీ తెలిసి ఈ బయోపిక్ ఒక సంచలనం సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: