ప్రపంచంలో చాలా మంది ఆడవాళ్ళు ఇప్పటికే దేశ ప్రధానుల గా పనిచేశారు. మొట్ట మొదటిసారిగా ప్రపంచంలోనే శ్రీలంకలో దేశ ప్రధానిగా ఒక మహిళ పని చేసింది. మన దేశంలో ఇందిరా గాంధీ మొదటి మహిళ ప్రధానిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఫిన్లాండ్ దేశం లో సనా మారిన్ అనే మహిళ అతి చిన్న వయసులోనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు . ఇది ఇప్పుడు అతి చిన్న వయసులో ఒక దేశ ప్రధానిగా పదవి చేప్పటి రికార్డు పొందారు. ఇంతకీ ఆమె వయసెంతో తెలియదు కదా కేవలం 34 సంవత్సరాలు మాత్రమే.
 ఫిన్‌లాండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వ ప్రధాన మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు.

 

సోషల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన సనా మారిన్‌ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ప్రస్తుత ప్రధాని ఆంటి రిన్ తర్వాత ప్రధాని పదవికి ఆమెను పార్టీ ఎంపిక చేసింది. సనా మారిన్ ఈ వారంలోనే ప్రధానిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. దేశంలో ఏర్పడ పోస్టల్ సమ్మె కారణంగా సంకీర్ణంలోని ఒక పార్టీ విశ్వాసం కోల్పోవటంతో ఇప్పటి ప్రధాని పదవి నుంచి వైదొలగారు. సనా మారిన్ ప్రధానిగా బాధ్యతలు చేపడితే.. ప్రస్తుతం ప్రపంచంలో అతి తక్కువ వయసున్న ప్రధానమంత్రి అవుతారు.

 

తాజాగా జరిగిన విశ్వాస తీర్మానాన్నిఅతి స్వల్ప ఆధిక్యంతో నెగ్గిన సనా మారిన్.. ''విశ్వాసాన్ని పునర్నిర్మించటానికి మనం చాలా కృషి చేయాల్సి ఉంది'' అని మీడియాతో చెప్పారు. ఆమె తన వయసు గురించి అడిగిన ప్రశ్నలను కొట్టివేశారు. ''నేను ఎన్నడూ నా వయసు గురించి ఆలోచించలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కారణాల గురించి ఆలోచిస్తాను. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కారణాల గురించి ఆలోచిస్తాను'' అని చెప్పారు.

 

ఫిన్‌లాండ్‌లో మూడో మహిళా ప్రధాన మంత్రిగా కూడా సనా మారిన్ చరిత్రకెక్కనున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ సోషల్ డెమొక్రటిక్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే ప్రధాన మంత్రిని ఆ పార్టీ నియమిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: