హైదరాబాద్  మెట్రో రైల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి  మూడు  ఫీట్ల  ఎత్తుకన్నా  తక్కువ వున్న పిల్లలు టికెట్  తీసుకోకుండా  మెట్రో రైళ్లో ఉచితంగా  ప్రయాణించవచ్చని  హెచ్ ఎమ్ ఆర్ తాజాగా  ప్రకటించింది.  మెట్రో  ప్రయాణాన్ని ప్రయాణికులకు  మరింత చేరువ చేసేందుకే హైదరాబాద్ మెట్రో సంస్థ  ఈ  ఫ్రీ రైడ్స్  సిస్టమ్ ను ప్రవేశపెట్టినట్లు గా తెలుస్తుంది.  
 
 
ఇక దేశం లో ఏ మెట్రో లో లేని సదుపాయాలను భాగ్యనగర వాసుల కోసం  హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో  భాగంగా  మహిళలకు  సెపరేట్ కోచ్ ను  అందుబాటులోకి ఉంచడం తోపాటు మెట్రో రైళ్లలో  లో  పెప్పర్ స్ప్రే  కూడా తీసుకెళ్లడానికి  ఇటీవలే అనుమతినిచ్చింది.  తాజాగా వికలాంగుల కోసం  వీల్ చైర్స్ ను కూడా  అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశం లో మిగితా మెట్రోలతో పోలిస్తే  హైదరాబాద్ మెట్రో చార్జీలే అధికం. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పేరొందిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన  ప్రాజెక్టు. 
 
 
 
ప్రస్తుతం  నాగోల్‌ నుంచి  అమీర్‌పేట్‌ వరకు అక్కడి నుంచి హైటెక్‌సిటీ  వరకు , ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో పరుగులు తీస్తోంది. కొద్దీ రోజుల క్రితం  హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు  మెట్రో అందుబాటులోకి రావడం వల్ల  రోజు  మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య  5లక్షలకు చేరుకోనుంది. ఈ రూట్ లతో పాటు  ప్రస్తుతం ట్రయల్‌రన్స్‌ కొనసాగుతున్న జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో  సైతం మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రావడం వల్ల  మరో లక్ష మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది.   రెండేళ్ల క్రితం  నగరంలో  మెట్రో సేవలు అందుబాటులోకి రాగ  అప్పటి నుంచి ఇప్పటి వరకు 12.5 కోట్ల మంది ప్రయాణికులు  మెట్రో సేవలను వినియోగించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: