రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను 13వ తేదీ వరకు భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. మహిళా హక్కుల సంఘాలు రాసిన లేఖను ప్రజాప్రయోజనవ్యాజ్యంగా తీసుకున్న కోర్టు నిన్న విచారణ చేపట్టి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
మహబూబ్ నగర్ ఆస్పత్రిలో సౌకర్యాలు చాలకపోతే మృతదేహాలను ఏసీ సదుపాయం ఉన్న వాహనాల్లో గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. పోలీస్ బందోబస్త్ మధ్య దిశ కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడిందని దిశ ఆత్మకు శాంతి చేకూరిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
దిశ ఉసురు తగలటం వలనే దిశ హత్య కేసు నిందితులు పోలీసుల చేతిలో కుక్క చావు చచ్చారని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైతే దిశను హత్య చేశారో అక్కడే నిందితులను పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేయటం పట్ల ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. మహబూబ్ నగర్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవటం వలన మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించక ముందే దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. 
 
దిశ ఉసురు తగలటం వలనే నిందితులకు ఇంత దారుణమైన కుక్కచావు వచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హైకోర్టు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. కోర్టు ఈ కేసులో కోర్టు సహాయకుడిగా సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డిని నియమించింది. నిందితుల ఎన్ కౌంటర్ గురించి హైకోర్టులో నిన్న మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు ఈ పిటిషన్ పై కూడా గురువారం విచారణ చేపట్టనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: