కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోదీ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌నతో పాటు స‌రిస‌మాన‌మైన పాపులార్టీ సొంతం చేసుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇక ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ఏకంగా మోదీ షాకు ఏకంగా కీలక‌మైన హోం మంత్రి ప‌ద‌వే ఇచ్చేశారు. ఇక తాజాగా ఇప్పుడు పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీలు సైతం ఎవ‌రికి తోచిన‌ట్టుగా అవి మాట్లాడుతున్నాయి. అయితే అమెరికాకు చెందిన ''కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌''.. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై స్పందించింది.

 

ఈ బిల్లు తప్పుడు దిశలో వెళ్తున్న ప్రమాదకరమైన మలుపుగా అభివర్ణించింది. ఇక ఈ బిల్లును తేవ‌డంలో కీల‌కంగా మారిన అమిత్ షాను అమెరికా క‌మిష‌న్ టార్గెట్ చేస్తున్న‌ట్టు గా తెలుస్తోంది. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అమిత్‌ షాపై ఆంక్షలు విధించే ఆలోచనలో అమెరికా కమిషన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం మతం ఆధారంగా శరణార్థులకు రక్షణ కల్పించేదిగా ఉన్నట్లు అమెరికా కమిషన్‌ అభిప్రాయపడింది.

 

ఇక బిల్లులో ఏదైతే శ‌ర‌ణార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నామ‌ని చెపుతున్నారో..అందులో శరణార్థుల్లో ముస్లింలు కాని వారికి భరోసా ఇవ్వడం సరిగా లేదని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించినట్లుగా బిల్లు ఉందని ఆ కమిషన్‌ పేర్కొన్నది. ఇక ఈ బిల్లు ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో సైతం పాస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ బిల్లు లోక్‌స‌భ లో పాస్ అవ్వ‌డంపై కూడా  యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

 

ఒకవేళ ఉభయసభల్లో పౌరసత్వ సవరణ బిల్లు పాసైతే, అప్పుడు హౌంమంత్రి అమిత్‌ షాతో పాటు ఇతర ప్రధాన నేతలపై ఆంక్షలు విధించాలని అమెరికా కమిషన్‌ సూచించింది. మ‌రి దీనిపై మోదీ, అమిత్ షా, బీజేపీ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: