ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిత్యం ప్రెస్ మీట్లు నిర్వహించే అలవాటు ఉంది. ఎప్పుడూ మీడియాలో హైలైట్ కావాలనే ఆయన తపన.. అనే విమర్శలు కూడా వస్తూంటాయి. వైసీపీ తీరును తప్పుబడుతూ.. ఆయన చేసిన పనులను మరోసారి చెప్పుకున్నారు. తాను చేసిన పనుల వల్లే రాష్ట్రానికి మేలు జరిగిందని మరెవరివల్లా ఇది సాధ్యం కాలేదని చెప్పుకున్నారు. ప్రస్తుత ప్రెస్ మీట్ ఆయన మాటల్లో..

 

 

'జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి.. పనులు గడప కూడా దాటడం లేదు. ఆరోజు మేము చేసిన పనుల వల్లే కియా మోటార్స్ వచ్చింది. చిత్తూరు వరకూ నీళ్లు తీసుకుపోయిన ఘనత మాదే. గాలేరు - నగరి పనులు చాలా వరకూ పూర్తి చేసాం. ఎన్టీఆర్ దీనికి శంకుస్థాపన చేస్తే పూర్తి చేసింది నేను. రాయలసీమకు నీళ్లివ్వాలని సంకల్పించింది ఎన్టీఆర్. గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తరలించి రాయలసీమకు నీళ్ళందించాం. నేను కాల్వలు తవ్వబట్టే ప్రాజెక్టులకు నీళ్లొచ్చాయి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సంకల్పించింది మేమే. నీరు-చెట్టు పనులు చేపట్టాం. హాయ్ ల్యాండ్ ను అక్రమించామని ఆరోపణలు చేస్తున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఎందుకిచ్చారు. గ్రామ వలంటీర్ల ఉద్యోగాలు ఎవరిమ్మన్నారు. మీడియాను అణగదొక్కుతున్నారు. ఏబీఎన్, టీవీ5ను ఎందుకు బ్యాన్ చేశారు' అంటూ ఆయన మీడియాతో మాట్లాడారు.

 

 

నిజానికి చంద్రబాబు చేసిన పనుల్లో అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగానే వచ్చాయి. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రాజెక్టులు ఎవరి హయాంలో ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై హర్షం వ్యక్తమవుతోంది. మీడియాలో గతంలో ఏకపక్ష వార్తలు వచ్చాయనే విమర్శ ఉంది. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు తన మీడియా అలవాటు మానుకోలేపోయారని వాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: