గత కొద్ది రోజుల నుండి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి ధరలు పెరగటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కేజి ఉల్లిని అందిస్తున్నా ప్రజలు ఉల్లిని కొనుగోలు చేయటానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కోడిగుడ్ల ధరలు కూడా షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తోంది. 
 
మార్కెట్ లో 5 నుండి 6 రూపాయల వరకు పలుకుతోన్న కోడిగుడ్డు ధర 10 రూపాయలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రోజుల తరువాత గుడ్లు కొనాలంటే కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. గుడ్ల ధరలు పెరుగుతూ ఉండటంతో మెనూ నుండి గుడ్లను తొలగించినట్లు తెలుస్తోంది. 
 
పౌల్ట్రీ రంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోవటం వలనే కోడిగుడ్డు ధరలు భారీగా పెరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో చాలా చోట్ల కోళ్ల ఫారాలు మూత పడ్డాయి. కోళ్లకు ఆహారంగా అందించే దాణా ఖర్చు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. వ్యాధుల కారణంగా కొన్ని కోళ్లు చనిపోతూ ఉండటంతో రైతులకు,కోళ్ల ఫారాల నిర్వాహకులకు నష్టాలు పెరుగుతున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండే దేశంలో అత్యధికంగా గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. కోళ్లను పెంచే రైతులు, కోళ్ల ఫారాలను నిర్వహించే వారు కోడిగుడ్ల రేట్లను పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కోడిగుడ్ల రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు గుడ్ల ధరలు పెరగితే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే భారీగా నిత్యావసర ధరలు పెరగటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కోడిగుడ్ల ధరలు పెరగటం షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: