ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.  రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన అసైన్డ్ భూముల కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్ల కేటాయింపుల రద్దుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.  అసలైన అసైన్డ్ దారులకు వాణిజ్య, నివాస ఫ్లాట్లు కేటాయించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.  కేబినేట్ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన చోటు చేసుకోవడంతో ఏపీ దిశ యాక్ట్ పేరుతో ఏపీ క్రిమినల్ లా చట్టం 2019కు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ కు కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
బలోపేతమైన యంత్రాంగాన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు మరియు గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ మరియు సమీక్షల కొరకు ఏర్పాటు చేయడానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న 51,488 ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంట్ లో పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భోగాపురం భూ సేకరణ సందర్భంగా నమోదైన కేసులు మరియు కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
వైయస్సార్ పెన్షన్ కానుక గ్రామీణ ప్రాంతాలలో నెలకు 10వేల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి పట్టణ ప్రాంతాలలో నెలకు 12,000 రూపాయలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తించనుంది.కర్నూలు జిల్లాలో కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్, కేవీఆర్ డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలను విలీనం చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
సంఘమిత్ర, యానిమేటర్లు, వీఓఏల జీతాల పెంపుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అక్రమంగా మద్యం తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా కఠిన శిక్షలు విధించే బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణించటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నేరాలకు మొదటిసారి పట్టుబడితే 2లక్షల రూపాయలు, రెండోసారి పట్టుబడితే 5లక్షల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా బిల్లును రూపొందించడం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: