పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్ప‌టికీ...రెండు స‌భ‌ల్లోనూ ఈ బిల్లు నెగ్గింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రాల్లో భారీ ఆందోళ‌న జ‌రుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో కేంద్ర ప్ర‌భుత్వం అద‌న‌పు సైనిక బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. అస్సాంలో రాష్ట్ర అసెంబ్లీలో ముందు పోలీసుల‌తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్క‌డ హింస చెల‌రేగింది. జీఎస్ రోడ్డు వ‌ద్ద బ్యారికేడ్లు తొల‌గించ‌డంతో విద్యార్థుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్ర‌యోగించారు. దిబ్రుగ‌ర్‌లో కూడా అల్ల‌ర్లు చెల‌రేగాయి.

నేను కేటీఆర్ పీఏను...ఓ 90 వేలు అడ్జెస్ట్ చేస్తారా ప్లీజ్‌


అయితే, తాజా పరిణామాలపై మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్‌హాసన్ ఘాటుగా స్పందించారు.  కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఏ రోగం లేని వ్యక్తి ఆపరేషన్ చేసినట్లుందని కమల్ హాసన్ ఎద్దేవా చేశారు. వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్ చేయడం ఎంతనేరమో కేంద్రం చేయనున్న చట్టం కూడా అంతే నేరమని కమల్ అభిప్రాయపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు నేరంతో సమానమని కమల్‌హాసన్ అభివర్ణించారు.కేవలం ఏ ఒక్క వర్గంపై పక్షపాత ధోరణి లేని భారత్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాజ్యాంగంలో ఎలాంటి తప్పుఒప్పులున్నా సరిచేయడానికి తాము ప్రయత్నిస్తామని చెప్పారు.

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!


మ‌రోవైపు పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు భ‌గ్గుమంటున్నాయి.  ఆ రాష్ట్రాల్లో నిర‌స‌న‌జ్వాల‌లు ర‌గులుతున్నాయి. అస్సాంలోని డిస్‌పూర్‌లో ఇవాళ ఆందోళ‌న‌కారులు ఓ బ‌స్సుకు నిప్పు అంటించారు. జ‌న‌తాభ‌వ‌న్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆందోళ‌న‌లు మిన్నంట‌డంతో.. ప్ర‌భుత్వం మొబైల్ సేవ‌ల‌ను నిలిపివేసింది. ఇవాళ రాత్రి 7 నుంచి రేపు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్నెట్ ఉండ‌దు. అస్సాంలోని ల‌కింపుర్‌, టిన్‌సుకియా, దెమాజి, డిబ్రుగ‌ర్‌, చ‌రాయ్‌డియో, శివ‌సాగ‌ర్‌, జోర్‌హ‌ట్‌, గోలాఘాట్‌, కామ్‌రూప్ జిల్లాల్లో ఇంట‌ర్నెట్‌పై నిషేధం విధించారు. గౌహ‌తిలో ఇవాళ రాత్రి 7 నుంచి రేప‌టి ఉద‌యం వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: