ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మాధ్యమం అమలు చేస్తే ఏమవుతుంది.. తెలుగు భాష మృతభాషగా మారుతుందా.. ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ అవుతుందా.. తెలుగు భాషకు గడ్డు కాలం వస్తుందా.. అయితే వీటి సంగతేమో కానీ.. రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియం అమలైతే తెలుగు భాష కాదు..తెలుగు దేశం పార్టీ మాత్రం అంతమవుతుందని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి ఎద్దేవా చేస్తున్నారు.

 

ఇంగ్లీష్‌ మీడియంపై ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. " చదువుకు, టాలెంట్‌కు పేదరికం అడ్డుకాకూడదు. సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకువచ్చారు. ఇంగ్లీష్‌ అవసరం ఎంత. ఈ రోజుల్లో కూలీలు, ఆటో డ్రైవర్లు రోజంతా సంపాదించింది తినడానికే సరిపోతుంది. కానీ ఒక పూట కడుపు మాడ్చుకొని తమ పిల్లలను చిన్న చిన్న ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారు. పేదలు తమ పిల్లలకు విద్యను మాత్రమే ఆస్తిగా ఇస్తున్నారని పుష్ప శ్రీవాణి చెప్పారు

 

చాలా మంది తెలుగు మీడియంలో చదివి ఏదో ఒక స్టేజీలో ఇంగ్లీష్‌ చదవాల్సిందే. ఇంగ్లీష్‌ పికప్‌ చేసినప్పుడు రాత పరీక్షల్లో పాస్‌ అవుతున్నారు. కానీ గ్రూప్‌ డిస్కన్‌లో విఫలమవుతున్నారు. దేశంలో కలెక్టర్‌ పిల్లలకు ఏ చదువు దక్కుతుందో వారి ఇంట్లో పని చేసే పిల్లలకు కూడా అదే విద్య చదివే హక్కు దక్కుతుంది. మంత్రి ఇంట్లో పని చేసే వారి పిల్లలకు కూడా అదే విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఆ హక్కును దేశంలో మొట్ట మొదటిసారి అమలు చేసేది మన సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమే అన్నారు ఉప ముఖ్యమంత్రి.

 

వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారు. ఇక మీదట ఈ రాష్ట్రంలో ప్రతి కూలీ, కార్మికుడు,టైలర్‌, బార్బర్‌ కుమారుడు కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవబోతున్నారు. కులం, మతం తేడా లేకుండా అందరూ ఇంగ్లీష్‌ మీడియం చదివే అవకాశం కల్పిస్తున్నారు. ఏపీ సువర్ణ అధ్యాయానికి వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇంగ్లీష్‌ మీడియం అనగానే పేదలు చదువుకోకూడదని ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. ఇంగ్లీష్‌ పేరుతో తెలుగును చంపేస్తున్నారని వితండవాదం చేస్తున్నారన ఆమె మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: