చంద్రబాబుకు కొన్ని తెలుగు పత్రికలు కరపత్రికల్లా వ్యవహరిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇటీవల అడ్డగోలుగా కథనాలు రాసే పత్రికలకు ముకుతాడు వేసేలా జగన్ సర్కారు కొత్త జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ జీవో అంటే చాలు సదరు ఎల్లో పత్రికలు భయపడుతున్నాయి. కొన్నిసార్లు.. ఏదేమైతే అది అయ్యిందని ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తున్నాయి.. కానీ.. తన ఎల్లో మీడియాను కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

 

అయితే గతంలో చంద్రబాబు సాక్షి మీడియాను వేధించిన చరిత్ర ఆయనకు ఇబ్బంది కరంగా మారింది. జీవో 2430ను ర‌ద్దు చేయాల‌ని ప‌త్రికా స్వేచ్ఛకు భంగం క‌లుగుతోంద‌ని బాధ‌ప‌డిపోతున్న చంద్రబాబునాయుడు … ముఖ్యమంత్రిగా ఉండ‌గా సాక్షి ప‌త్రిక‌పై ఎన్ని నోటీసులు పంపారో మ‌ర్చిపోయిన‌ట్టున్నారంటూ వైసీపీ మంత్రులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో జ‌గ‌తి ప‌బ్లికేష‌న్‌, సాక్షి ప‌త్రిక ఈడీ, ఎడిట‌ర్ల మీద వ‌రుసగా కేసులు దాఖ‌లు చేసిన విషయాలను తవ్వి తీస్తున్నారు.

 

అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ప్రతి కేసుకు ఐఏఎస్‌లతో విచార‌ణ చేయించాల‌ని ప్రత్యేకంగా చంద్రబాబు జీఓలు కూడా జారీ చేయించారు. ఇప్పుడు వాటిని జీవో నెంబర్లతో సహావైసీపీ మంత్రులు అసెంబ్లీలో వెల్లడిస్తున్నారు. చంద్రబాబు పత్రికాస్వేచ్ఛ అన్నప్పుడల్లా గతాన్ని గుర్తు చేస్తూ ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో చంద్రబాబు దూకుడుకు అడ్డుపడుతోంది.

 

ఇదే విషయంపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాత జీవోల వివరాలు ఏకరువు పెట్టారు. సింగ‌పూర్‌లో అమ‌రావ‌తి ప్రకంప‌న‌లు` వార్త గుర్తుందా. త‌ప్పుడు ప్రచారం చేస్తుంద‌న్న కార‌ణంతో సింగ‌పూర్ దేశంలో ప్రతిప‌క్షంపై చ‌ర్యలు తీసుకుంటూ ప్రత్యేక జీవో వ‌చ్చింద‌న్న విషయం బాబు తెలుసుకోవాలన్నారు. సాక్షి మీద చ‌ర్యలు తీసుకుంటూ జారీ చేసిన జీవోల వివరాలు సభకు వెల్లడించారు. జీఓ 868, జీఓ 1088, జీఓ 1698, జీఓ 2151, జీఓ 733 ల ద్వారా సాక్షి పాత్రికేయులపై కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: